హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కుక్క భయంతో మూడంతస్తుల భవనంపైనుంచి దూకిన డెలివరీ బాయ్ మృతి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కుక్క దాడి చేస్తుందనే భయంతో మూడంతస్తుల భవనంపైనుంచి దూకిన స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం బంజారాహిల్స్ లుంబినీ రాక్ క్రిస్టల్ అపార్ట్‌మెంట్‌కు రిజ్వాన్ ఫుడ్ వెలివరీకి వెళ్లాడు. డెలివరీ ఇచ్చే సమయంలో డోర్ ఓపెన్ చేయగా.. ఇంట్లోని జర్మన్ షెపర్డ్ కుక్క ఒక్కసారిగా అతనిపైకి దూసుకొచ్చింది. దీంతో భయాందోళనలకు గురైన రిజ్వాన్ మూడంతస్తుల భవనంపైనుంచి దూకేశాడు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారంనాడు రిజ్వాన్ మరణించాడు.

వివరాల్లోకి వెళితే.. జనవరి 11న బంజారాహిల్స్‌లోని లుంబినీ రాక్ కేజిల్ అపార్ట్ మెంట్‌ కి ఫుడ్ డెలివరీకి వెళ్లాడు. ఫుడ్ డెలివరీ చేసినవారి డోర్ తెరవగానే.. ఒక్కసారిగా వారింట్లోని జర్మన్ షెపర్డ్ కుక్క.. రిజ్వాన్ పైకి దూసుకొచ్చింది. దాని బారినుంచి తప్పించుకునేందుకు రిజ్వాన్ మూడంతస్తుల భవనంపైనుంచి దూకాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.

Hyderabad: Swiggy delivery boy died, who fell from third floor of an apartment, with fear of dog.

గమనించిన భవన యజమాని వెంటనే అంబులెన్స్ కోసం 108కు ఫోన్ చేశారు. అక్కడకు చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది.. తీవ్రగాయాలపాలైన రిజ్వాన్ ను ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయం కావడంతో అతడు నాలుగు రోజులపాటు కోమాలోనే ఉన్నాడు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. ఘటనపై రిజ్వాన్ కుటుంబసభ్యులు ఆ కుక్క యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కుక్క యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిజ్వాన్ మృతికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. దీంతో డాక్ ఓనర్ శోభనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బంజారాహిల్స్ పోలీసులు. కుక్కలు పెంచుకునే యజమానులు వాటిని ఇంత నిర్లక్ష్యంగా వదిలేయడం సరికాదని అంటున్నారు.

English summary
Hyderabad: Swiggy delivery boy died, who fell from third floor of an apartment, with fear of dog.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X