పెళ్లై 20 రోజులు అయినా కాకముందే .. సనత్ నగర్ లో మహిళా టెకీ అనుమానాస్పద మృతి

హైదరాబాద్లోని సనత్ నగర్ లో దారుణం జరిగింది. పెళ్లి చేసుకుని పట్టుమని నెల రోజులు కాకముందే ఒక వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న పూర్ణిమ మృతి పట్ల ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

20 రోజుల క్రితం ప్రేమపెళ్ళి చేసుకున్న పూర్ణిమ

20 రోజుల క్రితం ప్రేమపెళ్ళి చేసుకున్న పూర్ణిమ

ప్రేమపెళ్లి చేసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పూర్ణిమ 20 రోజులకే చనిపోవటంతో పలు అనుమానాలు వ్యక్తం అవతున్నాయి.పూర్ణిమ పెళ్లి చేసుకున్న కార్తీక్ ఆమెను చంపేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తూ..సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన దిగారు. తమ బిడ్డను హతమార్చిన కార్తీక్ కు కఠిన శిక్షపడేలా పోలీసు చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

భర్త కార్తీక్ పనే అని తల్లిదండ్రుల ఆందోళన

భర్త కార్తీక్ పనే అని తల్లిదండ్రుల ఆందోళన

తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమపెళ్లి చేసుకున్న పూర్ణిమఅనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సనత్ నగర్‌లో సంచలనం సృష్టించింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న పూర్ణిమ ప్రేమించిన 20 రోజుల క్రితం దాసరి కార్తీక్‌ను పెద్దలను ఎదిరించి మరీవివాహం చేసుకుంది. ఈ క్రమంలో పెళ్లై నెల రోజులు పూర్తి కాకుండానే పూర్ణిమ మృతి చెందటం అందరినీ షాక్ కు గురి చేసింది. పూర్ణిమ మృతిపై ఆమె తండ్రి ప్రసాద్ ఆవేదన చెందుతున్నారు.

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు


పూర్ణిమను ప్రేమ పేరుతో నమ్మించి గొంతు కోశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు. పూర్ణిమ భర్త కార్తీక్ తన కూతురును హత్య చేశాడని ఆమె తలపై బలమైన గాయం ఉందన్నారు.పూర్ణిమ ఒంటిపై, మెడపై గాయాలున్నాయన్నారు సనత్ నగర్ పోలీసులు . ఆమె ఉరి వేసుకున్నట్లు గా ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఇక ఆమె తలపై కూడా గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

పోలీసుల అదుపులో కార్తీక్.. కేసు దర్యాప్తు

పోలీసుల అదుపులో కార్తీక్.. కేసు దర్యాప్తు

పూర్ణిమ భర్త కార్తీక్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. పూర్ణిమ మృతదేహం వద్ద ఒక సూసైడ్ నోట్ కూడా దొరికిందని, అది పూర్ణిమ రాసినట్లుగా ఉందని అనుమానిస్తున్నారు. ఇక పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పిన సనత్ నగర్ పోలీసులు, ఈ జంట వివాహం చేసుకోవడానికి ముందు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో సనత్ నగర్ పోలీసులను ఆశ్రయించారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+