రాజీనామా చేస్తానంటూ అసెంబ్లీ వేదికగా కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మోడీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క రంగంలోనైనా వృద్ధిరేటు ఉందా? అని ప్రశ్నించారు.

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మోడీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క రంగంలోనైనా వృద్ధిరేటు ఉందా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆదివారం కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు.

సీఎం పదవికి రాజీనామా చేస్తానంటూ కేసీఆర్ సంచలనం

సీఎం పదవికి రాజీనామా చేస్తానంటూ కేసీఆర్ సంచలనం

మన్మోహన్ సింగ్ హయాంలో తలసరి ఆదాయం వృద్ధిరేటు 12.73 శాతం ఉంటే.. మోడీ హయాంలో తలసరి ఆదాయం వృద్ధిరేటు 7.1 శాతం అని కేసీఆర్ చెప్పారు. అప్పు చేయడంలో మోడీని మించిన ప్రధాని లేరని ఎద్దేవా చేశారు. డెట్ టు జీడీపీ మోడీ హయాంలో పెరిగిందన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలో డెట్ టు జీడీపీ 52.2 శాతం ఉంటే.. మోడీ హయాంలో 56.2 శాతం ఉందన్నారు. మూలధన వ్యయం మన్మోహన్ హయాంలో 37 శాతం ఉండగా.. మోడీ హయాంలో 31 శాతం అని వివరించారు. మన్మోహన్ హయాంలో ద్రవ్యలోటు 4.77 శాతం ఉండగా.. మోడీ హయాంలో 5.1 శాతం ఉందన్నారు కేసీఆర్. తాను ప్రస్తావించిన లెక్కల్లో ఒక్కమాట అబద్ధం ఉన్నా.. రాజీనామా చేస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.

మోడీ హయాంలో సైలెన్స్ రాజ్ అంటూ కేసీఆర్ ఎద్దేవా

మోడీ హయాంలో సైలెన్స్ రాజ్ అంటూ కేసీఆర్ ఎద్దేవా

అంతేగాక, దేశంలో అత్యంత విఫలమైన ప్రధాని మోడీ అంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు. మేకిన్ ఇండియా, విశ్వగురు ఎటుపాయే అంటూ కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మన్మోహన్ హయాంలో పారిశ్రామిక వృద్ధిరేటు 5.87 శాతం ఉండగా.. మోడీ హయాంలో 3.27 శాతం ఉందని చెప్పారు. మోడీ ఓ విఫల ప్రధాని అన్న కేసీఆర్.. కాంగ్రెస్ హయాంలో ఆయన లైసెన్స్ రాజ్.. మోడీ హయాంలో సైలెన్స్ రాజ్ అని వ్యంగ్రాస్త్రాలు సంధించారు కేసీఆర్. అదానీ విషయంలో ప్రధాని మోడీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు కేసీఆర్. ఎన్డీఏ అంటే నో డేటా అవలేబుల్ అంటూ ఎద్దేవా చేశారు.

జనగణన ఎందుకు చేయడం లేదంటూ మోడీపై కేసీఆర్ ఫైర్

జనగణన ఎందుకు చేయడం లేదంటూ మోడీపై కేసీఆర్ ఫైర్


కేంద్ర ప్రభుత్వ తీరుతో రూ. 3 లక్షల కోట్లు నష్టపోయిందని కేసీఆర్ ఆరోపించారు. నోట్ల రద్దు సమయంలో మోడీని సమర్థించానని అయితే.. అప్పుడు తాను మోడీకి చెప్పింది వేరని.. ఆయన చేసింది వేరని తెలిపారు.
ఇప్పటి వరకు దేశంలో జనగణన ఎందుకు చేయడం లేదని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రానికి సహకరిస్తాం కానీ.. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలతో దేశ ప్రజలకు మేలు జరగలేదని.. అందుకే బీఆర్ఎస్ వచ్చిందని చెప్పుకొచ్చారు. జై శ్రీరామ అంటారు.. జై భారత్ మాత అంటారు కానీ చేసిందేమి లేదని బీజేపీపై విమర్శలు గుప్పించారు. దేశంలో కొత్త ఇరిగేషన్ విధానం అవసరం ఉందన్నారు. దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఆ విధానం తెస్తుందున్నారు. కాగా, కేసీఆర్ ప్రసంగం అనంతరం పలు బిల్లులకు ఆమోదం లభించింది. ఆ తర్వాత అసెంబ్లీ నిరవధిక వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+