హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓరయ్యా.. బతికే ఉన్నా.. చనిపోలేదు, సోషల్ మీడియా పోస్టులపై శంకర్ రావు..

|
Google Oneindia TeluguNews

సోషల్ మీడియాతో మంచి ఎంత ఉందో చెడుగా కూడా అంతే.. కాకుంటే మనం ఎక్కువగా మంచి.. కామెంట్లు, షేరింగ్ గురించే మాట్లాడుతుంటాం. అయితే ఒకరు బతికి ఉండగా చనిపోయారని చెప్పడం దారుణం.. అలాంటి పరిస్థితి ఎవరికీ రాదు. మాజీ మంత్రి శంకర్ రావు అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆయన చనిపోయారని పోస్టులు పెట్టారు. దీంతో శంకర్ రావే స్వయంగా మీడియా ముందుకు వచ్చారు. అయ్యో.. నేను బతికే ఉన్నానని చెప్పుకొచ్చారు.

షాద్‌నగర్‌ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఆరోగ్యంగానే ఉన్నానని మాజీ మంత్రి డాక్టర్‌ శంకర్‌రావు అన్నారు. తానంటే గిట్టని వారు కొందరు చనిపోయానని సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి శంకర్‌రావు సోషల్‌ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. శంకర్‌రావు చనిపోయాడంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడంతో షాద్‌నగర్‌ ప్రాంతం నుంచి చాలా మంది తనకు ఫోన్‌ చేస్తున్నారని తెలిపారు. తాను చనిపోయానని వీడియో సృష్టించిన, ఫార్వార్డ్‌ చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని షాద్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశానని శంకర్‌రావు తెలిపారు.

iam not dead.. ex minister shankar rao

వినడానికి వింతగా ఉన్న ఇదీ నిజం.. అనారోగ్యంగా ఉంటే చాలు.. సెలబ్రిటీ అయితే ఇక అంతే.. బతికుండగానే చచ్చారని పోస్ట్ చేయడం సరికాదు. దీనిపై పోలీసులు/ సైబర్ విభాగం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే మరిన్ని పోస్టులు చేసి.. మరికొందరినీ ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంటుంది. సో ఖాకీలు ఈ అంశంపై జర ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. జర సోచో ఫ్రెండ్లీ పోలీస్..

English summary
iam not dead ex minister shankar rao said. some people post he is dead in social media.. than shankar rao reacted
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X