Ileana:బేబీ బంప్‌తో పోకిరి భామ... ఫోటోస్ వైరల్..!
Illeana:ఇలియానా అంటే గుర్తొచ్చే సినిమా పోకిరి. అంతకుముందు ఈ గోవా బ్యూటీ పలు చిత్రాలు చేసినప్పటికీ చాలామంది ఆమెకు అభిమానులుగా మారింది మాత్రం మహేష్ బాబు పోకిరితోనే. ఇక ఒకప్పుడు హైయస్ట్ పెయిడ్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఇల్లీ బేబీ ప్రస్తుతం టాలీవుడ్‌కు దూరమైంది. తెలుగు తెరకు దూరమైనప్పటికీ ఫ్యాన్స్‌ను మాత్రం సోషల్ మీడియాలో పలకరిస్తూనే ఉంది.
ఇలియానాకు పలు రాష్ట్రాల్లో గుడికూడా కట్టినటువంటి అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఇలియానా గురించి ఎందుకని అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నా. తాను ప్రెగ్నెంట్ అని సింబాలిక్‌గా తెలుపుతూ కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టిన ఈ బబ్లీ బ్యూటీ, తాజాగా మరికొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తన బేబీ బంప్‌ను చూపిస్తూ తీసిన ఫోటోలను ఇన్స్‌టాలో షేర్ చేసింది.

బ్లాక్ డ్రెస్‌లో బేబీ బంప్‌ను చూపిస్తూ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. బంప్ అలర్ట్ అని కోట్స్‌లో పెడుతూ పోస్ట్ చేసింది. ప్రెగ్నెంట్ అయినట్లు బయట ప్రపంచానికి చెబుతూ "అడ్వెంచర్ బిగిన్స్", "త్వరలోనే నా బిడ్డను కలుసుకోబోతున్నాను" అనే రెండు పోస్టులు ఇన్స్‌టా వేదికగా షేర్ చేసింది. ఇక ఈ వార్తలు కొంత మంది ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చినా చాలామంది ఆనందపడ్డారు.
ఇక అసలు విషయానికొస్తే, కత్రినాకైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో ఇలియానా డేటింగ్‌లో ఉంది. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌తో ఎప్పుడూ ఇలియానా సెబాస్టియన్ జోడి కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో యవ్వారం నడుస్తుందనే వార్తలు వచ్చాయి. వీరంతా మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. కరణ్ జోహార్ చాట్ షోపై కూడా ఇలియానా సెబాస్టియన్‌ల మధ్య బంధం ఉందని ఆ షో డైరెక్టర్ పరోక్షంగా కన్ఫామ్ చేశాడు.












Click it and Unblock the Notifications