రాహుల్‌ను చూసి కేసీఆర్ సర్కార్ వణుకుతుంది.. అందుకే ఓయూలో పర్మిషన్ ఇవ్వలే: రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ సభ కోసం బిజీగా ఉన్నారు. అయితే 7వ తేదీ ఓయూ పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీనిపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాహుల్ గాంధీ పర్యటనకు వస్తుంటే కేసీఆర్ హడలిపోతున్నారని కామెంట్ చేశారు. కేసీఆర్ ఓ పిరికి పాలకుడు అని, మరో పన్నెండు నెలల్లో ఆయన పాలన ముగియనుందని అన్నారు. రాహుల్ గాంధీ ఓయూకి వస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరించడంపై విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. అయితే వారిని అరెస్ట్ చేయడంతో.. కలిసేందుకు జగ్గారెడ్డి వెళితే ఆయనను కూడా అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు.

రాహుల్ గాంధీ సభకు ఉస్మానియా యూనివర్సిటీ అనుమతి ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకూడదని ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. రాహుల్ గాంధీ సభకే కాదు.. వర్సిటీలో ఏ బహిరంగ సభకు అనుమతి ఇవ్వకూడదని డిషిసన్ తీసుకుంది. క్యాంపస్‌లో కెమెరాలను కూడా నిషేధించింది. 7న ఉస్మానియా వర్సిటీలోని ఆర్ట్ కాలేజీ వద్ద.. రాహుల్‌గాంధీ విద్యార్థులను కలిసేలా టీపీసీసీ ప్లాన్‌ చేసింది. వారికి ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ షాకిచ్చింది. దీనిపై కొన్ని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి.

cm kcr government scared to rahul gandhi tour tpcc chief revanth reddy alleges.

రాహుల్‌ గాంధీ సభకు పర్మిషన్‌ ఇవ్వకపోవడం పట్ల కాంగ్రెస్‌ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ ఆగ్రహాం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు విద్యార్థిసంఘాల నేతలు ప్రయత్నించారు. ఆర్ట్స్ కాలేజీ ముందు విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.

వరంగల్ రైతు సంఘర్షణ సభకు దాదాపు 10 లక్షల మందిని సమీకరించాలని ప్లాన్ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి రాహుల్ చేరుకుంటారు. శంషాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో వరంగల్‌కు వెళతారు. వరంగల్ రైతు సంఘర్షణ సభ ప్రాంగణంలో రెండు వేదికలు ఏర్పాటు చేస్తారు. రాహుల్‌గాంధీ, ఇతర నేతలకు ఒకటి.. రైతు ఆత్మహత్యల కుటుంబాలకు మరో వేదిక నిర్మిస్తారు. సభ తర్వాత వరంగల్ నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ వెళతారు. అదు రోజు రాత్రి హైటెక్ సిటిలోని దుర్గం చెరువు పక్కనున్న కోహినూర్ హోటల్‌లో రాహుల్ గాంధీ బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం హోటల్ కోహినూర్‌లో టీపీసీసీ ముఖ్య నాయకులతో అల్పాహార సమావేశం నిర్వహిస్తారు. అక్కడి నుంచి సంజీవయ్య పార్క్ వెళతారు. సంజీవయ్య జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తారు. అటు నుంచి గాంధీ భవన్ వెళతారు. తెలంగాణ అమరవీరుల తో రాహుల్ గాంధీ లంచ్ ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+