రాములమ్మ గుస్సా.. కరోనా కట్టడిలో విఫలం, కేసీఆర్‌పైనా చిందులు
కరోనా వైరస్ నివారణలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ సర్కార్ తీరును ఆమె ఎండగట్టారు. తెలంగాణ సర్కారు ఏ పని చేసినా అరకొరగానే ఉంటుందనడానికి రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలను చూస్తే అర్థమవుతుందన్నారు.
విద్యార్థుల్లో కరోనా వ్యాపిస్తున్నందున వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు విద్యా సంస్థల మూసివేతకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అయితే మిగిలిన చోట్ల కట్టడికి ఏం చర్యలు తీసుకున్నారన్నది గమనిస్తే శూన్యమని విమర్శించారు. సూర్యాపేటలో సోమవారం జరిగిన కబడ్డీ పోటీల సందర్భంగా జరిగిన ప్రమాదాన్ని ప్రస్తావించారు. నిర్వహణ తీరు చూస్తే ప్రధానంగా రెండు తప్పులను అందరూ ఎత్తి చూపుతున్నారని గుర్తుచేశారు. ఇక్కడ కోవిడ్ నియంత్రణ చర్యలేవీ తీసుకోలేదని, గ్యాలరీ సామర్థ్యాన్ని పరీక్షించడంలో నిర్వాహకులు, అధికారులు విఫలమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయని చెప్పారు.

Recommended Video
ఇదే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కరోనా కట్టడికి తగిన చర్యలు అమలవుతున్న కావడం లేదన్నారు. అధికారులకు సరైన మార్గదర్శకాలు ఇచ్చి పరిస్థితి అదుపు తప్పకుండా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వివరించారు. పక్కనే గల మహారాష్ట్రలో పరిస్థితులను చూసి తెలంగాణ సర్కారు మేలుకోవడం లేదన్నారు. పాలకుల పాపాన్ని ప్రజలు అనుభవించాల్సి వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications