కరోనా ఎఫెక్ట్: ఒక్క అడుగుకే పరిమితం కానున్న ఖైరతాబాద్ వినాయకుడు...? వైరస్ తగ్గితే..?
కరోనా వైరస్ ఎఫెక్ట్ ఖైరతాబాద్ వినాయకుడికి కూడా తగలింది. ఎత్తైనా విగ్రహాంగా పేరున్న.. ఖైరతాబాద్ విగ్రహాన్ని ఈ ఏడాది ఒక అడుగుతో ఏర్పాటు చేయాలని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ తెలిపింది. భారీ విగ్రహాన్ని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తారు. ఆగస్ట్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని ఊహించి... అడుగు ఎత్తులో విగ్రహాం ఏర్పాటు చేస్తామని తెలిపింది.
వైరస్ ప్రభావం లేకుంటే 66 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ భావించింది. కానీ పాజిటివ్ కేసులు క్రమంగా పెరగడంతో.. అంత ఎత్తులో విగ్రహాం పెట్టొద్దనే నిర్ణయానికి వచ్చింది. ఈ నెల 18వ తేదీన కర్రపూజ కూడా చేయాలని భావించారు. కానీ దానిని కూడా నిర్వహించడం లేదని ఉత్సవ కమిటీ చైర్మన్ సింగిరి సుదర్శన్ తెలిపారు.

ఆగస్ట్ నాటికి కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వస్తే తాము తొలుత అనుకొన్న 66 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. లేదంటే అడుగు విగ్రహాంతోనే వినాయకుడిని కొలుస్తామని వివరించారు. ఎత్తైన వినాయకుడిగా ఖైరతాబాద్ గణేశుడికి పేరు ఉంది. ఇక్కడ వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. కానీ ఈ సారి మాత్రం ఆ ప్రభ కనిపించే అవకాశం లేకుండా పోయే అవకాశం ఉంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications