హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మానిక్కం ఠాగూర్‌తో కొండా దంపతుల భేటీ: పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో మీట్..

|
Google Oneindia TeluguNews

తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. పీసీసీ చీఫ్ ఎంపిక కోసం హైదరాబాద్ వచ్చిన ఇంచార్జీ మానిక్కం ఠాగూర్.. నేతలతో కూడా భేటీ అవుతున్నారు. వీరిలో కొందరు పార్టీ మారతారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఠాగూర్‌తో భేటీ కావడంతో ఆ నేతలు కాంగ్రెస్ పార్టీని వీడరనే స్పష్టత వచ్చింది. వారిలో వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ-మురళీధర రావు ఉన్నారు. పైకి పీసీసీ చీఫ్ ఎంపికపై చర్చలు జరిపినా.. అంతర్గతంగా పార్టీలో ప్రాధాన్యం గురించి డిస్కష్ చేసినట్టు సమాచారం.

ఠాగూర్‌తో భేటీ..

ఠాగూర్‌తో భేటీ..


పీసీసీ చీఫ్ ఎంపిక కోసం ఠాగూర్ అందరు నేతల అభిప్రాయం తీసుకుంటున్నారు. ఇవాళ కొండా సురేఖ-మురళీధరరావు వచ్చారు. పీసీసీ చీఫ్ గురించి ఠాగూర్ వారితో చర్చించారు. కొత్త నేత ఎంపిక గురించి అభిప్రాయం తీసుకున్నారు. తర్వాత ఇతర అంశాలపై డిస్కషన్ జరిగింది. త్వరలో వరంగల్ కార్పొరేషన్ ఎన్నిక జరగనుంది. దీని గురించి ఠాగూర్ అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలపై ఫోకస్ చేయాలని కొండా దంపతులకు సూచించారు. జిల్లాలలో అందరినీ కలుపుకోవాలని సూచించారు. అక్కడ కాంగ్రెస్ జెండా ఎగరేయాలని కోరారు.

బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం..

బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం..


కొండా దంపతులు బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. దీనికి ఊతం ఇచ్చేలా వారు దూరం దూరంగా ఉన్నారు. అయితే ఠాగూర్‌తో భేటీ కావడంతో.. ఆ అనుమానాలు పటాపంచలయ్యాయి. బీజేపీలోకి ఇక వెళ్లరనే అనుకొవచ్చు. ఇవాళ్టి భేటీలో కొండా దంపతులకు ఠాగూర్ హామీనిచ్చినట్టు తెలిసింది. దీంతో వారు పార్టీ కోసం పనిచేస్తామని చెప్పినట్టు సమాచారం.

రాజకీయ ప్రస్థానం..

రాజకీయ ప్రస్థానం..

కొండా దంపతుల రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. తర్వాత వైసీపీలో చేరి..కొన్నాళ్లపాటు కొనసాగారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అక్కడినుంచి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే వారికి వరంగల్ జిల్లాలో సరైన ప్రాధాన్యం లభించడం లేదు అని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీలో చేరతారనే ఊహాగానాలకు బలం చేకూరింది. అయితే వారు మానిక్కం ఠాగూర్‌తో భేటీ కావడంతో వారు కాంగ్రెస్ పార్టీని వీడరని స్పష్టమయ్యింది.

English summary
konda sureka-muralidhar rao couple meets telangana congress incharge manickam tagore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X