గుజరాత్ నుంచి తెలంగాణకు భారీ పెట్టుబడులు, చందన్‌వెల్లి పెద్ద పారిశ్రామికవాడ: కేటీఆర్

భవిష్యత్తులో చందన్‌వెల్లి అతిపెద్ద పారిశ్రామికవాడ కాబోతోందన్నారు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్: భవిష్యత్తులో చందన్‌వెల్లి అతిపెద్ద పారిశ్రామికవాడ కాబోతోందన్నారు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఐదేళ్ల క్రితం చందనవెల్లిలో ఒక్క పరిశ్రమ కూడా లేదని, ఇప్పుడు చందనవెల్లికి చాలా పెద్దపెద్ద కంపెనీలు వచ్చాయని మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లిలో వెల్ స్పన్ టెక్స్‌టైల్ యూనిట్‌ను కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రజాప్రతినిధులు, వెల్ స్పన్ ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న కేటీఆర్

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న కేటీఆర్

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం, మిషన్ భగీరథ తరహాలోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. దీంతో మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లలో పూర్తి చేసిందన్నారు. అయితే, దురదృష్టవశాత్తు కొన్ని కారణాలతో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయని కేటీఆర్ తెలిపారు.

అతిపెద్ద పారిశ్రామిక వాడగా చందన్‌వెల్లి: కేటీఆర్

అతిపెద్ద పారిశ్రామిక వాడగా చందన్‌వెల్లి: కేటీఆర్


ఐదేళ్ల క్రితం వరకు చందన్‌వెల్లిలో ఒక్క పరిశ్రమ కూడా లేదని.. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణలో అతిపెద్ద పారిశ్రామిక సమూహంగా ఈ ప్రాంతం మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుజరాత్ నుంచి వచ్చి వెల్‌స్పన్ ఇక్కడ భారీ పెట్టుబడి పెట్టిందన్నారు. రాబోయే ఐదేళ్లలో చందన్ వెల్లిలో 3వేల నుంచి 5వేల కోట్ల పెట్టుబడి పెడతామన్న ఆ సంస్థ అధినేత బాలకృష్ణ గోయెంకాకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక మహిళలను భాగస్వాములను చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్‌స్పన్ ప్రతినిధులు చెప్పడం సంతోషకరమని అన్నారు.

గుజరాత్ నుంచి తెలంగాణలో పెట్టుబడులు: కేటీఆర్

గుజరాత్ నుంచి తెలంగాణలో పెట్టుబడులు: కేటీఆర్

బాలకృష్ణ గొయెంక 1985లో ఒక సంస్థను స్థాపించి.. ఈ రోజు గుజరాత్‌లో 25వేల మందికి ఉపాధికి కల్పిస్తున్నారని ప్రశంసించారు. గుజరాత్‌తో పాటు అమెరికాలోను పెట్టుబడులు పెట్టారన్నారు. ఆయన తొలిసారిగా గుజరాత్‌ నుంచి బయటకు వచ్చి తెలంగాణలో వెల్‌స్పన్‌ సిటీని ఏర్పాటు చేశారంటూ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరినట్లు తెలిపారు.ఈ మేరకు ఆయన కచ్‌లో యూనిట్‌ స్థాపనను విరమించుకొని చందన్‌వెల్లిలో ఏర్పాటు చేశారన్నారు.

కేసీఆర్, కేటీఆర్‌లపై బాలకృష్ణ గోయెంకా ప్రశంసలు

వెల్‌స్పన్ గ్రూప్ ఛైర్మన్ బాలకృష్ణ గోయెంకా మాట్లాడుతూ.. చందన్‌వెల్లిలో తయారయ్యే సగం ఉత్పత్తులు సిలికాన్ వ్యాలీకి వెళ్తాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టి చందన్ వెల్లిని వెల్‌స్పన్ వ్యాలీగా మారుస్తామని అన్నారు. మంత్రి కేటీఆర్ విజన్.. చందన్ వెల్లి టు సిలికాన్ వ్యాలీ అన్నారు. సీఎం కేసీఆర్ అద్భుతమ దార్శనికతతో ముందుకెళ్తున్నారని బాలకృష్ణ ప్రశంసించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+