హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

KTR: ఫార్ములా ఈ-రేస్‍పై ఆనంద్‌ మహీంద్ర ట్వీట్.. వెలకమ్ టూ హైదరాబాద్ ఆనంద్ జీ అంటూ కేటీఆర్ రీట్వీట్..

దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఫార్ములా ఈ-రేస్ పై పారిశశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర ట్విట్ చేశాడు.

|
Google Oneindia TeluguNews

భారతదేశంలోనే తొలిసారిగా ఫార్ములా ఈ-రేస్ హైదరాబాద్‌లో జరగనుంది. ఈ- రేసింగ్ ఈవెంట్‌కు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రతిష్టాత్మంగా జరిగే ఫార్ములా ఇ-రేస్ ప్రారంభ కార్యక్రమానికి హాజరు కావాలని FIA ప్రపంచ పాలక సంస్థ అధ్యక్షుడిగా ఉన్న మొహమ్మద్​ బిన్​ సులేయంకు ఆహ్వానం పంపారు. దేశంలోనే హైదరాబాద్ లో ఫార్ములా ఈ- రేస్ నిర్వహిస్తుండడంతో ప్రాముఖల నుంచి తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు వెల్లువెత్తున్నాయి.

తాజాగా పారిశశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర ట్విటర్‌లో ఒక వీడియోను షేర్‌ చేశారు. FIA ఫార్ములా E వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఈవెంట్‌ను నిర్వహించే మొదటి భారతీయ నగరంగా హైదరాబాద్ అవతరించిందని ఆనంద్ మహీంద్రా ట్వీట్‌ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 8 సంవత్సరాల రేసింగ్ తర్వాత, దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో రేసింగ్‌ జరుగుతున్న ఈ సందర్భంగా తెలంగాణా ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే టైటిల్ స్పాన్సర్ గ్రీన్‌కో రేసును విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

KTR responds to industrialist Anand Mahindras tweet on Formula E-Race
ఆనంద్‌ మహీంద్ర ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. స్వాగతం ఆనంద్ గారు అని రీట్వీట్ చేశారు. కాగా.. ఈ రేసింగ్ కోసం హుస్సేన్ సాగర్ చుట్టూ 2.37 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మించారు. 18 మలుపులతో ఉన్న ట్రాక్‌పై రేసింగ్ నిర్వహించనున్నారు. ఈ రేస్‌లో 11 జట్లు, 22 మంది డ్రైవర్స్ పాల్గొంటారని నిర్వహకులు తెలిపారు. ఈ ఈవెంట్ కు హైదరాబాద్‌ సర్క్యూట్‌లో అడుగడుగునా భద్రతా పరంగా ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేయనున్నారు. పోటీలను వీక్షించేందుకు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను కూడా నిర్మిస్తున్నారు.

ఈ ఈవెంట్ సందర్భంగా ఫిబ్రవరి 5 నుంచి 11 వరకు తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.మింట్ కాంపౌండ్ నుంచి ప్రసాద్ ఐమాక్స్ వరకు వాహనాలను అలో చేయరని సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు.
ఈ ఈవెంట్ కు సంబంధించి నటుడు నాగార్జున కేటీఆర్ కు అభినందనలు తెలిపారు.తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌డుతున్న ఈరేసుకు సంబంధించిన‌ టికెట్ల‌ను ఇప్ప‌టికే బుక్‌మైషోలో అమ్మ‌కానికి పెట్టారు.

English summary
Economist Anand Mahindra shared a video on Twitter. Anand Mahindra tweeted that Hyderabad has become the first Indian city to host an FIA Formula E World Championship event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X