అయ్యా.. ఎన్నికలకు ముందే వెళ్లరాదు, కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి విసుర్లు
విశాఖ స్టీల్ ప్లాంట్ వేదికగా రాజకీయాలు సాగుతున్నాయి. సపోర్ట్ చేస్తున్నానని మంత్రి కేటీఆర్ ప్రకటించగా.. విపక్షాలు కౌంటర్ అటాక్ చేస్తున్నాయి. గతంలో చేసిన.. ప్రస్తుతం ఇచ్చిన హామీలను గుర్తుచేస్తున్నాయి. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ఆరోపణలు చేశారు. విశాఖ మీద కేటీఆర్ ప్రేమ వెనక అంటూ విరుచుకుపడ్డారు.

ఎన్నికలకు ముందే వెళ్లండి..
చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు ముందే కేటీఆర్ విశాఖ వెళ్లాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ ఏపీ ప్రజలు చేస్తున్న పోరాటానికి టీఆర్‌ఎస్ తరఫున మద్దతు తెలుపుతున్నామని కేటీఆర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ అనుమతితో ఉద్యమంలో కూడా పాల్గొంటామని తెలిపారు.

పోరాడి సాధించి..
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని గుర్తుచేశారు. పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైరయ్యారు. వేలాదిమంది రోడ్డునపడ్డ ఉద్యోగులు ఉద్యమాలు చేస్తున్నారని.. నైతికంగా అండగా ఉన్నామని తెలిపారు. అవసరమైతే కేసీఆర్ అనుమతి తీసుకొని వైజాగ్‌కు వచ్చి ప్రత్యక్షం గా మద్దతు తెలుపుతామని.. కేంద్రంపై కేటీఆర్ మండిపడ్డారు.

కేటీఆరే కారణం
ఇటు కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి విమర్శలు కొనసాగాయి. ఐటీఐఆర్ రాకపోవడానికి మంత్రి కేటీఆరే కారణమని ఆరోపించారు. 2018 నుంచి పట్టించుకోకుండా ఇప్పుడు కేంద్రంపై నెపం నెడుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ అసమర్థత వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదని తప్పుబట్టారు. తెలంగాణలో అలీబాబా అరడజను దొంగలు ఉన్నారని ఫైరయ్యారు. పరిశ్రమల భూముల్ని రియల్ ఎస్టేట్‌కు అమ్మేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ ఫ్రెండ్ శ్రీధర్ ద్వారా భారీ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. దోపిడీకి సహకరించడానికి సోమేశ్ కుమార్‌ను సీఎస్ హోదా ఇచ్చారని తెలిపారు.












Click it and Unblock the Notifications