నగరం నిండా ఎల్ఇడి బల్బులు.!ఎక్కువ వెలుతురు తక్కువ బిల్లు.!జీహెచ్ఎంసీ కొత్త ప్రణాళిక!
హైదరాబాద్ : నగరంలో వివిధ కాలనీల్లో, బస్తీల్లో నివసించే ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వీధి దీపాలను యుద్దప్రాతిపదికన నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటును చేస్తున్నట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా రహదారుల పైన ప్రమాదాల నివారణ, భద్రత కోసం లైట్లను ఏర్పాటు చేసి సమర్థవంతంగా నిర్వహిస్తారు. వీధి లైట్ల మూలంగా వస్తున్న విద్యుత్తు బిల్లుల చెల్లింపు ఒకప్పుడు బారంగా పరిణమించేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. విద్యుత్ పొదుపు చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో జిహెచ్ఎంసి కూడా తమ పరిధిలో నిర్వహిస్తున్న వీధి లైట్ల ద్వారా ఎక్కువ ఆర్థిక భారం పడకుండా ఎల్.ఇ.డి బల్బులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఈ న్వహణను ఓ ప్రయివేటు ఏజెన్సీ కి అప్పజెప్పారు అధికారులు. గతంలో ఉన్న ఎలక్ట్రిక్ బల్బుల స్థానంలో ఎల్.ఇ.డి బల్బులను సాధ్యమైన తొందరలో ఏర్పాటు చేయబోతున్నట్టు ఏజెన్సీ సిబ్బంది స్పష్టం చేస్తున్నారు.

జిహెచ్ఎంసి పరిధిలో మొత్తం 4.92 వేల ఎల్.ఇ.డి బల్బులను ఏర్పాటు చేశారని, ఈ పక్రియ వలన తక్కువ విద్యుత్ వినియోగంతో పాటుగా ఖర్చు కూడా తగ్గిందని అధికారులు చెప్పుకొస్తున్నారు. గతంలో ప్రతి నెల సరాసరి 20.07 ఏం.యు యూనిట్లకు 14.94 కోట్ల రూపాయలు ఖర్చు కాగా నేడు ఎల్.ఇ.డి లైట్లు ఏర్పాటు చేసిన తర్వాత 9.96 ఏం.యు యూనిట్లకు 8.5 కోట్ల రూపాయల ఖర్చు మాత్రమే అవుతుందని తెలుస్తోంది. 4.92 997 స్తంభాలకు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయగా 35.50 ఏం.డబ్లు యూనిట్ల లోడు అవుతోందని, అంతే కాకుండా 25,172 స్విచ్చింగ్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొంటున్నారు. ఎల్.ఇ.డి బల్బు ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 487.20 ఏం.యు యూనిట్లు పొదుపు చేశారని, ఈ సంస్థ అధ్వర్యంలో హెల్ప్ లైన్ ను కూడా ఏర్పాటు చేసి ఫిర్యాదు వచ్చిన వెంటనే పరిష్కారం చేస్తారని, అంతే కాకుండా సమర్థ నిర్వహణ కోసం సర్కిల్ వారీగా 17 ఏజెన్సీస్ లను ఏర్పాటు చేశారని, లెడ్ బల్బులు పెట్టిన తర్వాత విద్యుత్ అదా తో పాటుగా బిల్స్ కూడా తగ్గాయని నగర పాలక సంస్థ అధికారులు స్టష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications