Hyderabad Rains: హైదరాబాద్ అంతట వర్షాలు.. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ..
గ్రేటర్ హైదరాబాద్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. శనివారం ఉదయం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పిల్లలు పాఠశాలలకు, ఉద్యోగస్థులు కార్యాలయాలకు వెళ్లే సమయం కావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించాయి. మరోవైపు జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.
ఎక్కడా వాటర్ లాగింగ్ లేకుండా చూసుకుంటున్నారు. ఉప్పల్ సర్కిల్‌లోని వరంగల్ హైవేపై ఆదిత్య ఆసుపత్రి వద్ద నీటి మాన్‌సూన్ బృందం క్లియర్ చేసింది. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్‌పేట్, సికింద్రాబాద్, మెహిదీపట్నంలో తేలికపాటి వర్షం కురుస్తోంది. మాసబ్ ట్యాంక్, నాంపల్లి గోషామహల్‌లో, బేగంపేట్ , సికింద్రాబాద్, మల్కాజిగిరి, కంటోన్మెంట్ వాన పడుతోంది. వర్షాల నేపథ్యంలో బయటకు రాకపోవడమే మంచిదని అధికారులు చెబుతున్నారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని కోరుతున్నారు.

హైదరాబాద్ కు వాతవారణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాయంత్రం ఉద్యోగులు అందురూ ఒకేసారి బయల్దేరకుండా.. ముందు, వెనక బయల్దేరితే ట్రాఫిక్ కష్టాలు ఉండవని అధికారులు పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో నగరంలో వ్యాధులు ప్రబలకుండా పరిశుద్ధ నిర్వహణ సజావుగా జరగాలని, దీనిపై ఆయా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పర్యవేక్షించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కాట ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఆమె జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై సూచనలు చేశారు. వర్షాల కారణంగా రోడ్లపై ఏర్పడిన పాట్ పోల్స్ ను ఎప్పటికప్పుడు పూడ్చివేయించాలన్నారు. శానిటేషన్ నిర్వహణతోపాటు, శానిటేషన్ వర్కర్ల హాజరు మరింత మెరుగు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. డెంగ్యూ కేసులను ఎప్పటికప్పుడు గుర్తించి, సంబంధిత సమాచారాన్ని సకాలంలో అందించాలన్నారు.












Click it and Unblock the Notifications