మద్యం కిక్కు: రూ.3350 కోట్ల అమ్మకాలు, 34 లక్షల కేసుల బీర్లు విక్రయం
31 ఫస్ట్ డిసెంబర్.. రాష్ట్రంలో మద్యం ఎరులై పారుతుంది. అంతేకాదు ఈ నెలలో కూడా మద్యం విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల యువత రెండు రోజులు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. న్యూ ఇయర్ అంటే మందుబాబులకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పాయి. అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు చేసుకోవచ్చని ఆర్డర్స్ పాస్ చేశారు. దీంతో మద్యం సరఫరా జోరుగా సాగుతుంది.
సరుకు ఉంటుందో లేదోనని ముందుగానే మందుబాబులు లిక్కర్ కొనేశారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ శుక్రవారం సాయంత్రం వరకు రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్ జరిగాయి. మందుబాబులు సరికొత్త రికార్డ్స్ నెలకొల్పారు. రూ. 3 వేల 350 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. శుక్రవారం రోజు బిల్లింగ్ క్లోజ్ వరకు 40 లక్షల కేసుల లిక్కర్ సేల్ జరిగిందని ఆబ్కారీ శాఖ వెల్లడించింది. 34 లక్షల కేసుల బీర్లు కొనుగోలు చేశారని తెలిపింది. లిక్కర్ సేల్‌లో ఇదే అత్యధికమని పేర్కొంది.

ఇవాళ ఒకరోజు రూ.104 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 40 లక్షల కేసుల మద్యం విక్రయం జరగగా.. 34 లక్షల కేసుల బీర్ల అమ్మకం జరిగాయి. ఈ నెలలో రూ.3350 మద్యం విక్రయాలు జరగగా... గతేడాది డిసెంబర్‌లో 2764 కోట్ల విక్రయాలు జరిగాయి.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్‌బండ్‌లో వాహనాల రాకపోకలను బంద్ చేశారు. బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాల ట్రాఫిక్ తెలుగు తల్లి జంక్షన్ దగ్గర ఇక్బాల్ మినార్, లక్డీకాపూల్, అయోధ్య వైపు మళ్లిస్తారు. లిబర్టీ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను ఎగువ ట్యాంక్‌బండ్ వైపు అనుమతించరు. ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ లేన్, లక్డీకాపూల్ వైపు మళ్లిస్తారు. సాధారణ వాహనాల రాకపోకల కోసం సచివాలయానికి ఆనుకుని ఉన్న మింట్ కాంపౌండ్ లేన్ మూసివేశారు.












Click it and Unblock the Notifications