హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగిత్యాలలో మామిడి మార్కెట్.. కొల్హాపూర్ మార్కెట్‌కు మరిన్ని వసతులు: నిరంజన్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

జగిత్యాల మామిడి మార్కెట్‌కు త్వరలో శ్రీకారం చుడతామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌ మంజూరు చేసిన వాలంతరీ సంస్థ 10 ఎకరాల స్థలంలో మార్కెట్‌ను అభివృద్ధి చేస్తుందని వివరించారు. తాండూరు రైతుబజార్‌ను ఇంటి గ్రేటెడ్‌ మార్కెట్‌గా మార్చాలని అధికారులను ఆదేశించామని వెల్లడించారు.

ఇటు కొల్హాపూర్‌ మామిడి మార్కెట్‌‌ను మరిన్ని వసతులు అందుబాటులోకి తీసుకొస్తామని నిరంజన్‌రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి త్వరలో రైతులు, వ్యాపారులు, అధికారులతో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. యాసంగి కొనుగోలు కేంద్రాల వద్ద కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా మౌళిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

mango market establish at jagtial

పంటల కొనుగోళ్లు, మార్కెట్ల అభివృద్ధిపై మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 6వ తేదీన సూర్యాపేట జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి సన్నాహాలుచేస్తున్నట్టు తెలిపారు. రైతులు వారి వద్ద ఉన్న టార్పాలిన్‌లను కొనుగోలు కేంద్రాలకు వెంట తెచ్చుకోవాలని సూచించారు.

అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సీజన్‌ నుంచే కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. రైతు పంటను కొనుగోలు చేస్తామని.. ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని తెలియజేశారు. పంట నష్టపోతే కూడా పరిహారం వెంటనే చెల్లించేలా చర్యలు చేపడుతామని వివరించారు.

English summary
mango market establish at jagtial town agriculture minister niranjan reddy said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X