మజ్లిస్ నేత పర్వేజ్ రేవ్ పార్టీ , ఫామ్ హౌజ్ లో అశ్లీల నృత్యాలు .. 12 మందిపై కేసు నమోదు

పాతబస్తీలో అర్ధరాత్రి ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ రేవ్ పార్టీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చర్చనీయాంశమైంది. మజ్లిస్ కార్యకర్తలతో పాటుగా ఎంఐఎం పార్టీ నేత పర్వేజ్ రేవ్ పార్టీ లో మందేస్తూ చిందేయడంతో ఇది తెలంగాణ లో హాట్ టాపిక్ అయింది.

Recommended Video

    #revparty #dance #mim హైదరాబాద్; పాతబస్తీలో ఎంఐఎం కార్యకర్తల రేవ్ పార్టీ

     అమ్మాయిలను తీసుకొచ్చి ఫుల్లుగా మందేసి మజ్లిస్ నేతల అశ్లీల నృత్యాలు

    అమ్మాయిలను తీసుకొచ్చి ఫుల్లుగా మందేసి మజ్లిస్ నేతల అశ్లీల నృత్యాలు

    హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట లో మజ్లిస్ కార్యకర్తలు పక్క రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఫుల్లుగా మందేసి అశ్లీల నృత్యాలు చేశారు. మద్యం మత్తులో అమ్మాయిలతో అశ్లీలంగా ప్రవర్తించారు. ఉందా హిల్స్ లో ఫిబ్రవరి 13వ తేదీన జరిగిన ఓ రేవ్ పార్టీ లో మజ్లిస్ నేత పర్వేజ్ తో పాటుగా ఎంఐఎం కార్యకర్తలు అశ్లీల నృత్యాలు చేస్తూ అమ్మాయిలతో కలిసి ఉన్న వీడియో వైరల్ కావడంతో ఈ ఉదంతంలో 12 మందిపై చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

     పాతబస్తీ బండ్లగూడ కు చెందిన ఎంఐఎం నేత మహమ్మద్ పర్వేజ్ రేవ్ పార్టీ

    పాతబస్తీ బండ్లగూడ కు చెందిన ఎంఐఎం నేత మహమ్మద్ పర్వేజ్ రేవ్ పార్టీ

    పోలీసులు చెప్పిన కథనం ప్రకారం పాతబస్తీ బండ్లగూడ కు చెందిన మహమ్మద్ పర్వేజ్ మజ్లిస్ పార్టీ లో క్రియాశీల నేత గా ఉన్నాడు. బండ్లగూడ గౌస్ నగర్ ఉందా హిల్స్ చెరువు సమీపంలో పర్వేజ్ ఒక ఫామ్ హౌస్ నిర్మించాడు. 13వ తేదీన ఫామ్ హౌస్ ప్రారంభోత్సవం సందర్భంగా నలుగురు యువతులు ,నలుగురు హిజ్రాల ను పిలిపించి రేవ్ పార్టీ నిర్వహించారు. ఎంఐఎం నేత పర్వేజ్ సహా అక్కడికి వచ్చిన మిగతావారంతా మద్యం తాగి అమ్మాయిలతో కలిసి చిందేశారు.

     వీడియో వైరల్ , 12 మందిని గుర్తించి కేసులు నమోదు

    వీడియో వైరల్ , 12 మందిని గుర్తించి కేసులు నమోదు

    ఇక ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు పర్వేజ్ తో పాటుగా 12 మంది ని గుర్తించి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ అమ్మాయిలు ఎక్కడినుంచి తీసుకువచ్చారు ? ఏం జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఇక తాజా ఘటన నేపథ్యంలో ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పర్వేజ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా మజ్లిస్ పార్టీలో కీలక నేతగా ఉన్న వ్యక్తి రేవ్ పార్టీ నిర్వహించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మజ్లిస్ పార్టీని టార్గెట్ చేసే బిజెపి నాయకులకు ఆయుధంగా మారింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+