హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజా సంగ్రామం కాదు.. అజీర్తి యాత్ర.. మంత్రి కేటీఆర్ సెటైర్లు

|
Google Oneindia TeluguNews

అధికార, విపక్షాల మధ్య కౌంటర్ అటాక్ కంటిన్యూ అవుతోంది. హుజురాబాద్ బై పోల్ వేళ.. మరింత పదునుగా కామెంట్స్ చేస్తున్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసింది ఏం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. మునుగోడు నియోజికవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఫ్లోరోసిస్ ఇచ్చిందని విరుచుకుపడ్డారు. తెలంగాణ తొలి ఉద్యమకారుడు శ్రీకాంతాచారి అయితే ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు పక్కన ఉండి ఉద్యమకారులపై దాడుల చేయించిన వ్యక్తి రేవంత్ రెడ్డి కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు.

శ్రీకాంతాచారికి ఉద్యమ ద్రోహులు నివాళులు అర్పించే అర్హత లేదని కేటీఆర్ కామెంట్ చేశారు. సీఎం కేసీఆరే లేకుంటే టీపీసీసీసీ.. టీ బీజేపి ఉండేదా అని ప్రశ్నించారు. బీజేపీ చేసింది ప్రజాసంగ్రామ యాత్ర కాదని.. తిన్నది అరగక చేసినా అజీర్తి యాత్ర అని ఎద్దేవా చేశారు. బీజేపీ వాళ్ళకి తెలిసింది హిందూ ముస్లిం ఒకటేనన్నారు. మిషన్ భగీరథ నీళ్లు తాగి పచ్చని పంట పొలాల్లో యాత్ర చేసిన బీజేపీ నాయకులకు రాష్ట్ర అభివృద్ధి కనిపించడం లేదా మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

minister ktr satires about bandi sanjay yatra

హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 8వరకు నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13గా ప్రకటించారు. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల నిర్వహిస్తారు. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.

Recommended Video

అసెంబ్లీలో స్పీకర్ ను ఇరుకున పెట్టిన ఎమ్మెల్యే సీతక్క || Oneindia Telugu

హుజురాబాద్‌లో విజయం టీఆర్ఎస్- బీజేపీకి తప్పనిసరి. గెలుపు కోసం ఆ రెండు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికార పార్టీకి విజయం కంపల్సరీ.. లేదంటే మొహం చూపించుకునే పరిస్థితి ఉండదు. ఇక బీజేపీ పరిస్థితి అయితే మరీ దారుణం.. పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మాత్రం జీవన్మరణ సమస్యే.. ఎందుకంటే ఆయన ఓడిపోతే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ.. ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరీ హుజురాబాద్ ప్రజలు ఏం తీర్పు చెప్పనున్నారో చూడాల్సిందే.

English summary
telangana minister ktr satires about bjp state chief bandi sanjay yatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X