బీజేపీ నోటీసుకు.. గీత దాటలేదంటూ ఎమ్మెల్యే రాజా సింగ్ వివరణ: ఏమన్నారంటే.?
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సోమవారం వివరణ ఇచ్చారు. బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని క్రమశిక్షణ కమిటీకి ఆయన లేఖ రాశారు. రాజా సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆగస్టు 23న బీజేపీ అధిష్టానం రాజా సింగ్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

తాను ఏ మతాన్నీ కించపర్చలేదన్న రాజా సింగ్
అయితే, ఆయన జైల్లో ఉండటంతో సమాధానం ఇచ్చేందుకు గడువు కావాలని రాజా సింగ్ సతీమణి ఉషాబాయి బీజేపీ అధిష్టానాన్ని రాజా సింగ్ సతీమణి ఉషాబాయి కోరారు. ఈ క్రమంలోనే రాజా సింగ్ సోమవారం బీజేపీ అధిష్టానానికి లేఖ రాసి తన వివరణ ఇచ్చారు. తానెక్కడ పార్టీ నిబంధనలను ఉల్లంఘించలేదని.. ఏ మతాన్ని కించపర్చలేదన్నారు రాజా సింగ్.

టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి తప్పుడు కేసులు పెట్టాయన్న రాజా సింగ్
వివాదాస్పాద
స్టాండప్
కమెడియన్
మునావర్
ఫారుఖీ
షో
సందర్భంగా
తాను
రిలీజ్
చేసిన
వీడియోపై..
టీఆర్ఎస్,
ఎంఐఎం
కలిసి
తప్పుడు
కేసు
పెట్టాయని..
ఆ
కేసును
కోర్టు
డిస్మిస్
చేసిందని
రాజా
సింగ్
తెలిపారు.
మునావర్
ఫారుఖీని
ఇమిటేట్
మాత్రమే
చేశానని..
ఏ
మతాన్ని,
వ్యక్తిని
కించపరిచేలా
వ్యాఖ్యలు
చేయలేదని
రాజా
సింగ్
స్పష్టం
చేశారు.
టీఆర్ఎస్,
ఎంఐఎం
దురాగతాలపై
అలుపెరగని
పోరాటం
చేస్తున్నానని
ఆ
లేఖలో
రాజాసింగ్
చెప్పారు.

ఎంఐఎంను ప్రశ్నిస్తే.. ముస్లింలను తిట్టినట్లుగా..: రాజా సింగ్
ఎంఐఎం
విధానాలను
ప్రశ్నిస్తే
ముస్లింలను
తిడుతున్నట్లుగా
వక్రీకరిస్తున్నారని..
తనపై
100కు
పైగా
తప్పుడు
కేసులు
పెట్టారని
రాజా
సింగ్
తెలిపారు.
మునావర్
ఫారుఖీ
షో
రోజు
తనతో
పాటు
5
వందల
మంది
బీజేపీ
కార్యకర్తలను
అరెస్ట్
చేశారని
తెలిపారు.
తానెక్కడా
నిబంధనలను
ఉల్లంఘించలేదని..
పార్టీలో
కొనసాగుతూ
బీజేపీకి,
దేశానికి
సేవ
చేసే
అవకాశం
ఇవ్వాలని
పార్టీ
డిసిప్లినరీ
కమిటీకి
రాసిన
లేఖలో
రాజా
సింగ్
విజ్ఞప్తి
చేశారు.
కాగా,
ఎమ్మెల్యే
రాజాసింగ్‌ను
ప్రివెంటివ్
డిటెన్షన్(పీడీ)
యాక్ట్
కింద
పోలీసులు
ఆగస్టు
25న
అరెస్టు
చేసి
చర్లపల్లి
జైలుకు
తరలించిన
విషయం
తెలిసిందే.
అప్పటి
నుంచి
ఆయన
చర్లపల్లి
జైలులో
ఉన్నారు.
పీడీ
యాక్ట్‌కు
సంబధించి
32
పేజీల
డ్యాక్యుమెంట్‌ను
పోలీసులు
రాజాసింగ్‌కు
ఇచ్చారు.
దేశవ్యాప్తంగా
101
కేసులు
నమోదయ్యాయని..
మత
విద్వేషాలను
రెచ్చగొట్టేలా
రాజాసింగ్
వ్యాఖ్యలున్నాయని
పేర్కొన్నారు.