• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బోడుప్పల్ సంగీతపై హత్యాయత్నం .. భర్తపై అనుమానం, వారెంట్ ఉన్న పట్టుకోని పోలీసులు ..

|

హైదరాబాద్ : తోడుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేశాడు. ఓ పాపకు జన్మనిచ్చాక కానీ అతగాడి ప్రవర్తన బోధపడలేదు. అప్పటికే ఓ పెళ్లైందని తెలిసి బాధపడింది. సరే భర్త కానీ అని సర్దుకుపోవడమే తప్పయిపోయింది. ఆ భర్త రూప రాక్షసుడు రెచ్చిపోయాడు. తన భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఇంట్లోంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె ఓపికతో కాపురం చేస్తున్నా .. చంపించే ప్రయత్నం చేశాడో నీచుడు.

భర్త రూప రాక్షసుడు ..

భర్త రూప రాక్షసుడు ..

అప్పట్లో సంగీత అనే వివాహిత ఆందోళన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన కూతురితోపాటు భర్త ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. బిడ్డతోపాటు ఇంటినుంచి వెళ్లగొట్టడంతో నిరసన చేపట్టడంతో .. కోర్టు జోక్యం చేసుకుంది. సంగీత అత్త మామల వద్దే ఉండాలని, ఆమె ఆర్థిక అవసరాలు తీర్చాలని స్పస్టంచేసింది. కోర్టు తీర్పుతో భర్త శ్రీనివాస్ రెడ్డి రగిలిపోయాడు. తాళి కట్టిన భర్తే .. ఆమెతో ఉండేందుకు అయిష్టం వ్యక్తం చేశాడు. అదనుచూసి దెబ్బకొట్టే ప్రయత్నం చేశాడు.

అండ దండలతో ...

అండ దండలతో ...

బోడుప్పల్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డితో సంగీత పెళ్లి చేసుకుంది. శ్రీనివాస్ రాజకీయంగా పలుకుబడి ఉంది. ఆర్థికంగా కూడా మంచి పోజిషన్‌లో ఉన్నాడు. అయితే అతనికి అప్పటికే ఓ పెళ్లయిందనే విషయం సంగీతకు తెలియదు. విషయం తెలిసి బాధపడింది. తర్వాత సర్దుకొని కాపురం చేసింది. వీరికి పండంటి కూతురు జన్మించింది. తర్వాత తమ కాలనీలో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు శ్రీనివాస్. ఇదేంటని నిలదీస్తే ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. అయితే సంగీత తన కూతురితోపాటు భర్త ఇంటి ముందు 45 రోజులు ఆందోళన చేపట్టింది. ఈ విషయం వీడియాలో చూసి కోర్టు విచారణ జరిపింది. సంగీత .. భర్త వద్దే ఉండాలని .. ఆర్థిక సాయం కూడా చేయాలని స్పష్టంచేసింది. దీంతో శ్రీనివాస్ రెడ్డి రగిలిపోయాడు. అయితే ఇంతకుముందు కూడా సంగీతపై శ్రీనివాస్ హత్యాయత్నం చేశారని సంగీత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

హత్యాయత్నం

హత్యాయత్నం

ఇది గతం .. కానీ ఇవాళ సంగీతపై మరోసారి హత్య ప్రయత్నం జరిగింది. బోడుప్పల్‌లోని ఇంటి నుంచి మార్కెట్‌కు వెళ్లి వస్తుండగా కారు ఢీ కొంది. అయితే ఆమె ఎడమ పక్కన ఎడ్జ్‌లో నడుస్తున్నారు. ఆమెను టార్గెట్ చేసి ఢీ కొనడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. దానికితోడు ఆ ఇన్నోవా కారుకు ముందు, వెనుకలో నెంబర్ ప్లేట్ లేకపోవడం సందేహాలకు తావిచ్చింది. రోడ్డు ప్రమాదం తర్వాత సంగీతను ఆస్పత్రిలో చేర్చించారు. ఆమె తలకు గాయాలయ్యాయి. తన సోదరిని చంపేందుకు శ్రీనివాస్ ప్రయత్నించాడని సంగీత సోదరుడు ఆరోపించాడు. గతంలో కూడా హత్య ప్రయత్నాలు చేశాడని పేర్కొన్నారు. ఇదివరకు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. కేసు నమోదు చేసి .. తూతూ మంత్రంగా దర్యాప్తు చేసి వదిలేసేవారని గుర్తుచేశారు. ఇదివరకు మేడిపల్లి పోలీసుస్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చామని గుర్తుచేశారు. వాస్తవానికి శ్రీనివాస్‌పై వివిధ కేసులు ఉన్నాయని ... అయినా అరెస్ట్ చేయడం లేదన్నారు. అదేంటి అరెస్ట్ చేయడం లేదని అడిగితే .. మాకు కనిపించడం లేదు .. కనిపిస్తే చెప్పాలని ఎదురు ప్రశ్నిస్తున్నారని గుర్తుచేశారు.

ప్రోద్బలం

ప్రోద్బలం

ఆర్థికంగా బాగున్న శ్రీనివాస్‌కు .. రాజకీయ అండదంగలు ఉన్నాయి. అధికార పార్టీ యూత్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడని అతని బావమరిది చెప్తున్నాడు. అంతేకాదు మాజీ ఎంపీ, ప్రస్తుత మంత్రి అండదండలతో శ్రీనివాస్ ఆగడాలు కొనసాగుతున్నాయని వాపోయారు. తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా .. పోలీసులు పట్టించుకోవడం లేదని .. తమకు చావే శరణ్యమని నిట్టూరుస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
sangeetha is married to Srinivas Reddy. Going from home to market, the car crashed. But she's running on the edge to the left. Suspicions arise with her targeting. In addition, the lack of a number plate on the front and front of the Innova car raised doubts. sangeetha was taken to a hospital after a road accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more