తెలంగాణలో వేగంగా: తగ్గుతోన్న కరోనా పేషెంట్లు: వైరస్ వ్యాప్తికి బ్రేక్ పడినట్టేనా?

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో మరోసారి భారీగా తగ్గుదల కొనసాగుతోంది. రోజువారీ కరోనా కేసుల క్షీణత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొద్దిరోజులుగా వరుసగా వెయ్యికంటే తక్కువ సంఖ్యలో రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొత్త కేసుల సంఖ్య తగ్గడం, కోలుకుంటోన్న వారి సంఖ్యలో యధాతథంగా కొనసాగుతోండటం వల్ల యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి. కరోనా బారిన పడి చికిత్స పొందుతోన్న వారి సంఖ్యలో వేగంగా తగ్గుతోంది.

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 837 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నలుగురు మరణించారు. 1,554 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,32,671కి చేరుకుంది. ఇందులో డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,13,466గా నమోదైంది. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 1315కు చేరుకోగా... రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కేసులు 17,890కి పడిపోయింది. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 14,851 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

Newly 837 Covid19 positive cases and 4 deaths reported in Telangana last 24 hours

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త కేసుల సంఖ్య పరిమితంగా ఉంటోంది. కొత్తగా 24 గంటల్లో 185 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆదిలాబాద్-7, భద్రాద్రి కొత్తగూడెం-48, జగిత్యాల-14, జనగామ-8, జయశంకర్ భూపాలపల్లి-6, జోగుళాంబ గద్వాల-9, కామారెడ్డి-22, కరీంనగర్-51, ఖమ్మం-76, కొమరంభీమ్ ఆసిఫాబాద్-5, మహబూబ్‌నగర్-15, మహబూబాబాద్-10, మంచిర్యాల-11, మెదక్-28, మేడ్చల్ మల్కాజ్‌గిరి-41, ములుగు-9, నాగర్ కర్నూలు-31, నల్లగొండ-16, నారాయణపేట్-1, నిర్మల్-8, నిజామాబాద్-13, పెద్దపల్లి-7, రాజన్న సిరిసిల్ల-18, రంగారెడ్డి-59, సంగారెడ్డి-10, సిద్ధిపేట్-40, సూర్యాపేట్-16, వికారాబాాద్-8, వనపర్తి-10, వరంగల్ రూరల్-9, వరంగల్ అర్బన్-34, యాదాద్రి భువనగిరి-12 కేసులు నమోదు అయ్యాయి.

తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు మరోసారి మందగించాయి. 24 గంటల్లో కొత్తగా 21,099 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 41,15,516కు చేరుకుంది. ప్రతి 10 లక్షల మందికీ 1,10,,572 టెస్టులను నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+