తెలంగాణలో ఐదు రోజులపాటు వర్షాలు: ఉరుములు, మెరుపులతో కూడిన వానలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి మరికొద్దిరోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురియనున్నాయి. ఇప్పటికే మండుతున్న ఎండలతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే, ఈ మధ్యలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా తెలంగాణలో రానున్న ఐదు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 2 నుంచి ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, అకాల వర్షాల కారణంగా చేతికి వస్తున్న పంటలు నాశనమవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశంలోని ఈ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు
వేసవి కాలం ప్రారంభమైన క్రమంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. మరింత ఉష్టోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య, ద్వీపకల్ప ప్రాంతాం మినహా భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవయ్యే అవకాశం ఉందని భారత వాతవరణ శాఖ(IMD) శనివరాం వెల్లడించింది.
ఈ కాలం మధ్య తూర్పు, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంచాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.
ఏప్రి్ల నుంచి జూన్ వరకు దక్షిణ ద్వీపకల్ప భారతదేశం, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. మిగితా ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలే ఉంటాయని పేర్కొన్నారు. ఇక ఏప్రిల్ నెలలో వర్షపాతం సాధారణంగానే ఉండనుందని తెలిపారు.
మధ్య వాయువ్య, ద్వీపకల్ప ప్రాంతంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని.. తూర్పు, ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications