Hyderabad: ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!

ప్రకృతిని పూజించే పండుగా బతుకమ్మ.. తెలంగాణ వారు ఎక్కడున్న బతుకమ్మ వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. చివరి అంటే తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఘనంగా జరుపుతారు. చిన్న, పెద్ద అందరూ కలిసి బతుకమ్మ పాటలు పాడుకుంటూ ఆడతారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే సద్దుల బతుకమ్మ జరుపుకునేందుకు హైదరాబాద్ సిద్ధమైంది. సద్దుల బతుకమ్మ వేడుకలు సందర్భంగా సిటీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ఈ ఆంక్షలు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనాలను ఇక్బాల్ మినార్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తారు. పీ.వి. విగ్రహం ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి NTR మార్క్ వైపు వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ వద్ద ప్రసాద్ IMAX, మింట్ కాంపౌండ్ లేన్ వైపు మళ్లిస్తారు. రాణిగంజ్ నుంచి పివిఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) వైపు వచ్చే వహనాలను నల్లగుట్ట "ఎక్స్" రోడ్ల వద్ద ట్రాఫిక్‌ను మినిస్టర్ రోడ్డు వైపు మళ్లిస్తారు.

Occasion Of Saddula Bathukamma celebrations traffic restrictions have been imposed in many parts of Hyderabad

ఎగువ ట్యాంక్ బండ్‌కు వచ్చే వాహనాలను పాత అంబేద్కర్ విగ్రహం వద్ద వాహనాలు ఇక్బాల్ మినార్ వైపు మళ్లించనున్నారు. సికింద్రాబాద్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను కర్బలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్ వైపు ట్రాఫిక్ మళ్లించనున్నారు. ధోబీ ఘాట్ నుంచి చిల్డ్రన్స్ పార్క్/అప్పర్ ట్యాంక్ బండ్ కు వచ్చే వాహనాలను DBR మిల్స్ వద్ద కవాడిగూడ "X" రోడ్ల వైపు మళ్లిస్తారు. హైదరాబాద్‌లో బతుకమ్మ వేడుకల కారణంగా సాధారణ వాహనాలకు ట్రాఫిక్‌ ఆంక్షలు తప్ప, ఆర్టీసీ బస్సులపై ఆంక్షలు ఉండవని పోలీసులు పేర్కొన్నారు.

సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ మీదుగా ఎంజీబీఎస్‌కు వచ్చే అంతర్‌ జిల్లా ఆర్టీసీ బస్సులను స్వీకర్‌-ఉపాకర్‌ జంక్షన్‌ వద్ద మళ్లించనున్నారు. వైడబ్ల్యూసీఏ, సంగీత్‌, మెట్టుగూడ, తార్నాక, నల్లకుంట, ఫీవర్‌ హాస్పిటల్‌, ఇతర ల్యాండ్‌మార్క్‌ల మీదుగా ఎంజీబీఎస్‌కు చేరుకుంటాయి. ట్యాంక్ బండ్ వైపు వెళ్లే సిటీ బస్సులను కర్బలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్ వైపు మళ్లిస్తారు. బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని పోలీసులు కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+