హైదరాబాద్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్; తెలంగాణాలో ఆపరేషన్ టెర్రర్ !!
భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు చాపకింద నీరులా విస్తరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంటే ఎక్కడికక్కడ గుట్టు చప్పుడు కాకుండా ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఉగ్ర మూక.
ఇటీవల ఈ క్రమంలో హైదరాబాద్ తో పాటు భోపాల్లో 16 మంది ఉగ్రవాదులను ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ అయ్యారు. వారిలో ఐదుగురు హైదరాబాదులో పట్టు బడ్డారు. ప్రస్తుతం వీరందిరినీ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. వీరంతా వికారాబాద్ అటవీ ప్రాంతంలో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసుకొని ఉగ్రవాద శిక్షణ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.

దీంతో పక్కా సమాచారంతో హైదరాబాద్ ఇంటెలిజెన్స్ పోలీసులు అప్పట్నుంచి ఆపరేషన్ టెర్రరిస్ట్స్ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు మరో ఇద్దరిని ఏటీఎస్ పోలీసులు బాబా నగర్ లోనూ, చాంద్రాయణగుట్ట లోనూ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో కలకలం రేపిన ఉగ్రవాదుల వ్యవహారంలో మతం మార్చుకున్న ప్రొఫెసర్ సలీం కీలకంగా వ్యవహరించినట్టు దర్యాప్తు బృందాలు గుర్తించాయి.
హైదరాబాద్ లో ఉగ్రవాద కార్యకలాపాల వైపు ఇతరులను ఆకర్షించేలా చేయడంలో ప్రొఫెసర్ సలీమ్ కీలక భూమిక పోషించినట్టు పోలీసులు గుర్తించారు. ఉగ్రవాద నెట్వర్క్ ను ఏర్పాటు చేయడం కోసమే అతడు హైదరాబాద్ కు వచ్చినట్టు విచారణలో గుర్తించారు. ఏడాది కాలంలో ఇతను నాలుగు ఇళ్ళు మారినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి.

సలీం మొదట సైదాబాద్ నుంచి అక్బర్ బాగ్ కు, అక్కడి నుండి సీతాఫల్మండి కి అక్కడ నుండి గోల్కొండ ప్రాంతానికి మకాం మార్చినట్టు గుర్తించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న నిందితులు నగరంలో రహస్యంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడం చేస్తున్నారు.
విధ్వంసం లక్ష్యంగా వీళ్ళు పని చేస్తున్నారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో ఈ నెట్వర్క్ పై దృష్టిసారించిన ఏటీఎస్ పోలీసులు ఎక్కడ తనిఖీలు నిర్వహిస్తూ ఉగ్రవాదులను అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు కూడా మరో ఇద్దరినీ అరెస్ట్ చేశారు ఏటీఎస్ పోలీసులు.












Click it and Unblock the Notifications