ఇంటర్ స్టూడెంట్ సాత్విక్ ఆత్మహత్య కేసులో నలుగురి అరెస్ట్..

హైదరాబాద్ నార్సింగిలోని శ్రీచైతన్య కళాశాల విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వారిని రాజేంద్రనగర్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

హైదరాబాద్: హైదరాబాద్ నార్సింగిలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ నలుగురు కూడా సాత్విక్‌ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయ్యారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. సాత్విక్- ఈ నలుగురి పేర్లను తన సూసైడ్ నోట్ లో పొందుపరిచారు. లెక్చరర్ల వేధింపులు, ఒత్తడి వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆ విద్యార్థి సూసైడ్ నోట్ లో రాశారు.

ఈ నలుగురినీ అరెస్ట్ చేయాలంటూ భువనగిరికి చెందిన కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇదే డిమాండ్‌ పై కోమటిరెడ్డి- శ్రీచైతన్య కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. నిరసన దీక్షను చేపట్టారు. సాత్విక్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన నలుగురిపైనా కఠిన చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు, బంధుమిత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తోన్నారు.

Police have arrested Staff of Sri Chaitanya Jr College, after a Student Satwik dies by suicide

ఈ క్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఆచార్య, ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, క్యాంపస్ వార్డెన్ నరేష్‌, శోభన్‌ ను పోలీసులు కొద్దిసేపటి కిందటే అరెస్ట్ చేశారు. అనంతరం వారిని నార్సింగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. రాజేంద్రనగర్ లోని మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. అటు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఈ ఘటనపై విచారణ చేపట్టింది. జిల్లా విద్యాశాఖాధికారులు శ్రీచైతన్య కళాశాలను సందర్శించారు. నోటీసులు జారీ చేశారు.

తన కుమారుడిని కళాశాల యాజమాన్యం మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడికి గురిచేసిందంటూ సాత్విక్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. సాత్విక్ ను వాళ్లే పొట్టనబెట్టుకున్నారంటూ కన్నీరుమున్నీరయ్యారు. కులం పేరుతో దూషించారని విమర్శించారు. ప్రతి విద్యార్ధినీ యాజమాన్యం హింసించిందని ధ్వజమెత్తారు. ఫీజు చెల్లిస్తేనే పరీక్షలు రాయనిస్తామంటూ బెదిరించే వారని, కాలేజీ సిబ్బంది పెట్టే టార్చర్ ను భరించలేకపోతున్నామంటూ సాత్విక్ స్నేహితులు కూడా చెప్పారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+