కేసీఆర్ ద్రోహి..? భావితరాలు క్షమించరు: పొన్నాల లక్ష్మయ్య
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం.. నీటి ప్రాజెక్టులపై అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రాష్ట్ర పరిధిలో ఉండే జలవనరుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషీ ఎంటో అర్థం కావడం లేదని మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. నీటిపై కేంద్రం పెత్తనం చేయడానికి చేస్తోన్న ప్రయత్నంతోపాటు అలాంటి అవకాశం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కూడా తప్పేనని అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో ఎక్కడాలేని విధంగా జలయజ్ఞం పేరుతో 86 ప్రాజెక్టులను ప్రారంభించామని గుర్తుచేశారు. గత ఏడేళ్లలో సాగునీటి విషయంలో కేసీఆర్ వెలగబెట్టింది ఏంటని ప్రశ్నించారు. లక్ష కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టిన కాళేశ్వరంతో తెలంగాణకు ఏం లాభం జరుగుతుందో కేసీఆర్ చెప్పగలరా అని అన్నారు.

కేసీఆర్ ఒంటెద్దు పోకడలు తెలంగాణకు నష్టం చేస్తున్నాయని వివరించారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు చేస్తున్నారని, కృష్ణా బోర్డు పాపం కేసీఆర్‌కు ఊరికేపోదని అన్నారు. దేశంలో బొగ్గు లేక అనేక విద్యుదుత్పాదన ప్రాజెక్టులు మూతపడ్డాయని, బీజేపీ ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలుస్తోందని అన్నారు. కేంద్రం దగ్గర ప్రణాళిక లేని కారణంగానే బొగ్గు కొరత, కరెంటు కోతలు వచ్చాయని, పాలనను పక్కనపెట్టిన బీజేపీ రాజకీయాలపై దృష్టి పెట్టిందని విమర్శించారు. టీఆర్ఎస్ కూడా బాధ్యత లేకుండా మెలగుతుందని ఫైరయ్యారు.
రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చినన తర్వాత ఒక్క మెగావాట్ కూడా కొత్తగా విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోయారని పొన్నాల ఎద్దేవా చేశారు. కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాయని వివరించారు. కేసీఆర్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. మీడియా సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి కైలాశ్‌కుమార్, ఫిషర్‌మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఉన్నారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications