రాజ్ భవన్ కాదు.. నోవాటెలే, మోడీ బస ఇక్కడే.. ఎస్పీజీ సూచనతో ఇలా
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లలో కమలదళం నిమగ్నమైంది. ప్రధాని మోడీ రావడంతో ఎస్పీజీ రంగంలోకి దిగింది. ఇప్పటికే భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. సమావేశాలకు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు సహా ప్రధాని మోడీ హాజరవుతున్నారు.

భద్రత కట్టుదిట్టం
హైదరాబాద్ నగరంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో మోడీ బస చేస్తారు. అయితే ఆయన ఎక్కడ ఉంటారనే అంశంపై తొలుత రాజ్ భవన్ అని ఏర్పాట్లు చేశారు. కానీ హఠాత్తుగా మార్చివేశారు. పలు కారణాల వల్ల నోవాటెల్ హోటల్‌లో ప్రధాని మోడీ బస చేస్తారు. రాజ్ భవన్ నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే ప్రాంతానికి దూరం ఉంటుంది. 14 కిలోమీటర్ల దూరం ఉండటంతో రాజ్ భవన్ నుంచి హెచ్ఐసీసీ వరకు ప్రధాని రాకపోకలు , భద్రతా ఏర్పాట్లు విషయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

ఎస్పీజీ సూచనతో
నిఘా వర్గాలు రిపోర్ట్ చేశాయి. ఎస్పీజీ సూచన మేరకు ప్రధాని మోడీ బస కోసం నోవాటెల్‌లో ఏర్పాట్లు చేశారు. హోటల్ లో మొత్తం 288 గదులు ఉన్నాయి. ప్రధాని బస కోసం ఓ ఫ్లోర్ మొత్తం రిజర్వు చేశారు. ఆ ఫ్లోర్‌లోకి ఇతరులను రానీయరు. అంటే మిగతా ప్లోర్‌లలో మాత్రం ఎప్పటిలాగే వెళ్లొచ్చు. అంటే వారు కూడా బీజేపీ శ్రేణులు అయి ఉంటారు.. ఎందుకంటే బీజేపీ కార్యవర్గ సమావేశాల కోసం 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు హోటల్ మొత్తం బుక్ చేశారని హోటల్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఓన్లీ పార్టీ శ్రేణులే
సో ఆ మూడు రోజులు అక్కడ పార్టీ శ్రేణులు, నేతలే ఉంటారు. మరొకరు కనిపించే అవకాశం ఉండదు. ఆ పరిసర ప్రాంతాలను ఇప్పటికే ఎస్పీజీ క్షుణ్ణంగా తనిఖీ చేపట్టింది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. కొత్త వారిని ఆ ప్రాంతంలోకి అనుమతివ్వడం లేదు.












Click it and Unblock the Notifications