Hyderabad: పట్నంలో మళ్లీ వర్షం.. పిడుగుపాటుతో కాలిపోయిన కొబ్బరి చెట్టు..

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మరోసారి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల, పిడుగులు కూడా పడ్డాయి. రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ రాజేంద్రనగర్ జోన్ డీసీపీ కార్యాలయం ప్రాంగణంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడి కాలిపోయింది.

పిడుగు పడి కొబ్బరి చెట్టు కాలిపోయే దృశ్యాలను తమ ఫోన్లలో బంధించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్, బషీర్ బాగ్ , బేగంబజార్, కోఠి, మీర్ పేట్, చాంద్రాయణగుట్ట, ఫలక్ నుమా, ఛత్రినాక, శాలిబండ ప్రాంతాల్లో గాలితో కూడుకున్న వాన పడింది.

Rains and thunder storms in hyderabad

కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్​బాగ్ నారాయణగూడలో ఈదురుగాలులతో చిరు జల్లులు పడ్డాయి. ఖైరతాబాద్, లక్డీకపూల్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. జగద్గిరిగుట్ట, చింతల్, బాలానగర్‌, చంపాపేట్, సరూర్‌నగర్‌, చైతన్యపురి, సైదాబాద్ పరిసర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హైకోర్టు సమీపంలో చెట్టు నేలకొరిగి ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సిటీ కాలేజ్ వెనుక వైపు రోడ్డుపై చెట్టు నేల కొరిగి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

చంపాపేట్‌లో ఈదురు గాలులకు చెట్లు, కరెంట్ స్తంభాలు కిందపడిపోయాయి. ఉదయం భారీ ఎండ సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షంతో పట్నం వాసులు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వడగాళ్ల వాన పడింది. వడగళ్ల వానతో పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతీన్నాయి. గతంలో వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించిన ఇంతవరకు అందలేదని వాపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+