రూ.24 వేల కోట్లతో పరిశ్రమ, హైదరాబాద్‌లో ఏర్పాటు, చరిత్రాత్మకం: కేటీఆర్
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ఇన్వెస్ట్ మెంట్స్ వస్తున్నాయి. ఫార్చ్యూన్-500 కంపెనీల్లో ఒకటైన రాజేష్ ఎక్స్ పోర్ట్స్ సంస్థ భారీ పెట్టుబడులతో తెలంగాణలో డిస్ ప్లే తయారీ యూనిట్ స్థాపించనుంది. అధునాతన అమోలెడ్ డిస్ ప్లే తయారీ యూనిట్ దేశంలో ఇదే మొదటిదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రూ.24 వేల కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో ఏర్పాటు చేయడం గర్వకారణం అన్నారు. దీంతో మరింత మంది యువతకు ఉపాధి లభించే అవకాశం ఉంది.

చరిత్రాత్మక రోజు..
దేశంలో హైటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో అత్యంత భారీ పెట్టుబడుల్లో ఇదొకటని ఆయన తెలిపారు. రాష్ట్రానికి ఇది చరిత్రాత్మక రోజు అని అభివర్ణించారు. హైటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో భారతదేశాన్ని ప్రపంచపటంలో నిలిపిన ఘనత తెలంగాణదేనన్నారు. ఆధునిక పరిశ్రమలు సాధారణంగా జపాన్, కొరియా, తైవాన్ వంటి దేశాల్లో కనిపిస్తాయని, ఇప్పుడు తెలంగాణలోనూ ఏర్పాటవుతోందని వివరించారు.

హైదరాబాద్ సిగలో
స్మార్ట్‌టీవీ, మొబైల్‌ఫోన్ల డిస్‌ప్లే తయారు చేసే సంస్థ అమోలెడ్ భారత్‌లో అతి పెద్ద పరిశ్రమను హైదరాబాద్‌లో నెలకొల్పనుందిరు. రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ (ఎలెస్ట్) అమోలెడ్ డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్ తయారీ యూనిట్‌ను తెలంగాణలో స్థాపించనుందని కేటీఆర్ తెలిపారు. భాగస్వామ్య సంస్థలకు, అనుబంధ పరిశ్రమలకు అనుకూల వాతావరణం సృష్టించే దిశగా ప్రపంచస్థాయి టీవీ, స్మార్ట్ ఫోన్, ట్యాబ్ తయారీదారులకు అతిపెద్ద సరఫరాదారుగా నిలవనుందని కేటీఆర్ వివరించారు.

జపాన్, కొరియా, తైవాన్
బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ అత్యాధునిక అమోలెడ్ స్క్రీన్‌లను తయారు చేస్తోంది. ఇప్పటి వరకు జపాన్, కొరియా, తైవాన్ దేశాలకు సాధ్యమైన అరుదైన ఫీట్ ఇకపై ఇండియాలో నెలకొల్పనుంది. పరిశ్రమ రాకతో టీవీలు, ట్యాబ్స్, స్మార్ట్‌ఫోన్ల తయారీకీ అవసరమైన ఎకో సిస్టమ్ రాష్ట్రంలో తయారవుతుందని, తెలంగాణకు ఈ రోజు చారిత్రాకమైన రోజని కేటీఆర్ అభివర్ణించారు. కంపెనీ ప్రతినిధులు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందంపై బెంగళూరులో సంతకాలు చేశారు.












Click it and Unblock the Notifications