ఏసీబీ కస్టడీకి నోట్ల కట్టల ఎమ్మార్వో.. ఆదాయానికి మించిన ఆస్తుల యవ్వారం..!
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కేశంపేట ఎమ్మార్వో లావణ్య ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డ విషయం తెలిసిందే. ఏసీబీ సోదాల్లో 93 లక్షల రూపాయలు బయటపడ్డాయి. ఆ క్రమంలో రిమాండ్ నిమిత్తం ఆమె చంచల్‌గూడ జైలులో ఉన్నారు. అయితే ఆమెను మరింత విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టును ఆశ్రయించారు.
ఏసీబీ అధికారుల వినతి మేరకు ఏసీబీ ప్రత్యేక కోర్టు కస్టడీకి అనుమతించింది. ఆ మేరకు ఎమ్మార్వో లావణ్యను రెండు రోజుల కస్టడీకి తీసుకోనున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో అధికారులు లావణ్యను విచారించనున్నారు. ఏసీబీ అధికారులు లావణ్యను శుక్రవారం నాడు కస్టడీకి తీసుకోనున్నారు.

ఓ రైతు దగ్గర నుంచి నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ కొందుర్గు వీఆర్‌ఓ అనంతయ్య ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెట్‌గా పట్టుబడ్డారు. అయితే ఆయన ఇచ్చిన సమాచారంతో దాని వెనుక ఎమ్మార్వో లావణ్య పాత్ర ఉందని ఆధారాలు సేకరించారు ఏసీబీ అధికారులు. ఆ మేరకు హిమాయత్‌నగర్‌లోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు.
ఏసీబీ అధికారుల సోదాల్లో 93 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు తేలడంతో ఏసీబీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. రెండేళ్ల కిందట ఉత్తమ తహశీల్దార్ అవార్డు అందుకున్న లావణ్య.. ఇప్పుడు అవినీతి కేసులో అరెస్ట్ కావడం గమనార్హం.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్‌తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!












Click it and Unblock the Notifications