ఆంక్షలు: 31 నుంచి జనవరి 2 వరకు, న్యూ ఇయర్ వేడుకలపై ఎఫెక్ట్
ఒమిక్రాన్ దడదడ లాడిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధించింది. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ నిర్వహించుకునే సమావేశాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది.
జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న చోట థర్మల్ స్కానింగ్ ఏర్పాటు చేసి ఉష్ణోగ్రతలు పరిశీలించాలని చెప్పింది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం కూడా తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ నిబంధన ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించని వారికి రూ.1000 జరిమానా విధిస్తారు. అన్నీ జిల్లాల్లో ఈ ఆంక్షలు సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శనివారం ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని కొందరు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ధర్మాసనం క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలపై ఆంక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఈరోజు ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు ఒమిక్రాన్ వల్ల.. నైట్ కర్ఫ్యూ దిశగా రాష్ట్రాలు అడుగు వేశాయి. ఎంపీ, యూపీ తర్వాత హర్యానా నిలిచింది. నిన్న రాత్రి నుంచే కర్ఫ్యూ అమలు చేసింది. మహారాష్ట్రలో కూడా కర్ఫ్యూ లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఒమిక్రాన్ కేసులు ఎక్కవగా రావడంతో.. హర్యానాలో కర్ఫ్యూపై నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు బయటకు జనాలు రావొద్దు.
మాల్స్, రెస్టారెంట్లు, బ్యాంక్లు, మండీ, గ్రెయిన్ మార్కెట్, ఆఫీసులు 200 మంది కన్నా ఎక్కువ మందిని అలొ చేయడానికి వీలు లేదు. ఇండోర్, అవుడ్ డోర్లలో కూడా తగిన ఆంక్షలు ఉన్నాయి. హర్యానాలో 6 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలు గుమికూడొద్దని ప్రభుత్వం తెలిపింది. దీంతో కరోనా కేసులు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications