పీజేఆర్ ఆనాడే గొంతెత్తారు.. విష్ణుతో రేవంత్ రెడ్డి భేటీ, అండగా ఉంటానని భరోసా
రేవంత్ రెడ్డి నేతలతో వరసగా భేటీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఇతర నేతలను వరసగా కలుస్తూ వస్తున్నారు. ఇదివరకు అంతగా ప్రాధాన్యం లభించని/ పక్కనబెట్టిన నేతలను మీట్ అవుతున్నారు. వారికి తాను ఉన్నానని భరోసాను ఇస్తున్నారు. కలిసి పనిచేద్దాం అని.. పార్టీని నిలబెడదాం అని చెబుతూ వస్తున్నారు. రోజుకో నేత చొప్పున రేవంత్ రెడ్డి సమావేశం అవుతున్నారు. ఇవాళ పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని కలిశారు.

పోతిరెడ్డిపాడు మరణశాసనమే..
పీజేఆర్‌ను రేవంత్ రెడ్డి కొనియాడారు. పార్టీకి, తెలంగాణ కోసం పీజేఆర్ ఆనాడే గొంతు ఎత్తారని చెప్పారు. పోతిరెడ్డిపాడు తెలంగాణ ప్రజల పట్ల మరణశాసనంగా మారుతుందని ఆనాడే పీజేఆర్ చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. పీజేఆర్ గొప్ప నాయకుడు అని ప్రశంసలతో ముంచెత్తారు. విష్ణువర్ధన్ రెడ్డి తనకు సోదర సమానుడు అని రేవంత్ రెడ్డి అన్నారు. పీజేఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఆనాటి ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు నష్టం కలిగించే కొన్ని నిర్ణయాలు తీసుకుంటుందని పీజేఆర్ కొట్లాడడంతో ఆయనను కేబినెట్‌లోకి తీసుకోలేదని అన్నారు.

ఆశయాలతో ముందుకెళ్తాం..
పీజేఆర్ ఆశయాలను తాము ముందుకు తీసుకువెళతామని రేవంత్ రెడ్డి స్పస్టంచేశారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని రేవంత్ రెడ్డి భరోసాను ఇచ్చారు. దీంతో విష్ణు శిబిరంలో మరింత ఆత్మవిశ్వాసం నింపినట్టు అయ్యింది. ఇదివరకు పట్టించుకోలేదని.. ఇప్పుడు టీ పీసీసీ ఛీప్ స్వయంగా ఇంటికి రావడంతో ధైర్యం ఇచ్చినట్టు అయ్యింది.

శ్రావణ్‌తో భేటీ
మరోవైపు కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ కుమార్‌తో రేవంత్ రెడ్డి మీట్ అయ్యారు. ఆయన కార్యాలయానికి వెళ్లి మరీ కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు డిస్కష్ చేశారు. ఇప్పటికే జానారెడ్డి, షబ్బీర్ అలీని రేవంత్ రెడ్డి కలిసిన సంగతి తెలిసిందే. తన, పర అనే భేదం లేకుండా ప్రతీ ఒక్కరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి.
అందరినీ కలుపుకొని ముందుకుసాగేలా ప్రణాళిక రచించారు. 7వ తేదీన పీసీసీ చీఫ్ పదవీ చేపడతారు. ఆ తర్వాత పాదయాత్ర కూడా చేస్తారని తెలిసింది. ఇప్పటికే బండి సంజయ్ తన పాదయాత్ర తేదీని కూడా ప్రకటించారు. ఇక రేవంత్ రెడ్డి ప్రకటించడమే తరువాయిగా మిగిలింది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications