హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.2 వేల నోట్లు.. నడిరోడ్డుపై గుట్టలు గుట్టలుగా.. ఎగబడిన జనం

|
Google Oneindia TeluguNews

ధనం మూలం ఇదం జగత్.. ఉదయం లేచినప్పటి నుంచి ప్రతీ ఒక్కరు పనిచేసేది డబ్బు కోసమే.. నగదు వల్లే పేరు, ప్రఖ్యాతలు.. ఎవరూ ఔనన్నా.. కాదన్నా ఇదీ నిజం. అయితే కొందరు ఆశపడి... తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని అనుకుంటున్నారు. అలా అనుకుని.. అడ్డంగా దొరికిపోతారు. ఇక ఎక్కడైనా నగదు కనిపిస్తే ఇవ్వడం రేర్.. తమ జేబులో వేసుకోవడానికి చాలా మంది ట్రై చేస్తారు. ఇక రూ.2 వేల నోట్లు కనిపిస్తే.. ఊరుకుంటారా..? అసలే ఆ నోట్లు కనిపించడం లేదు. సో ఎగబడటం ఖాయం.. అచ్చం అలాంటి ఘటనే విశ్వనగరి భాగ్యనగరిలో జరిగింది. అదీ హైటెక్ సిటీ సమీపంలో వెలుగు చూసింది.

ఫేక్..

ఫేక్..

హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. మాదాపూర్ పరిధిలో రూ.2వేల నకిలీ కరెన్సీ నోట్లు కనిపించాయి. నడిరోడ్డుపై గుట్టలుగా పోసిన కరెన్సీ నోట్లను చూసి అటుగా వెళ్లే జనం ఎగబడి చూశారు. 100 ఫీట్ రోడ్ సమీపంలోని కాకతీయ రోడ్డులో రూ.2వేల కరెన్సీ నోట్లు గుట్టలుగా పోసి ఉంచారు. నోట్లను చూసిన వెంటనే స్థానికులు, వాహనదారులు కరెన్సీ నోట్లను తీసుకునేందుకు ఎగబడ్డారు. దొరికిన కరెన్సీ నోట్లను చాలామంది తీసుకున్నారు. రూ.2 వేల నోట్లపై చిల్డ్రన్ బ్యాంకు ఆఫ్ ఇండియా అని ఉండటంతో నోట్లు తీసుకెళ్లినవారంతా నిరుత్సాహానికి గురయ్యారు.

ఎగబడిన జనం

ఎగబడిన జనం

నకిలీ కరెన్సీ నోట్లని తెలియక చాలామంది నోట్లను తీసుకునేందుకు ఎగబడ్డారు. కొంతసేపు భారీగా ట్రాఫిక్ జాం అయింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేశారు. రోడ్లపై గుట్టలుగా పడి ఉన్న నకిలీ రూ.2వేల కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాదిలో హైదరాబాద్ గోల్కొండ పరిధిలో నకిలీ కరెన్సీ కలకం రేపింది.

సమాచారం అందుకున్న పోలీసులు భారీ మొత్తంలో నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్లతో సంబంధం కలిగిన ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో దగ్గర లభ్యమైన సంచుల్లో రూ.2వేలు, రూ.500 నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఇలా మరోసారి నకిలీ నోట్లు దొరికాయి.

రూ.2 వేల నోట్లు లేవే..?

రూ.2 వేల నోట్లు లేవే..?

ఇప్పుడు మార్కెట్లో రూ.2 వేల నోట్లు కనిపించడం లేదు. దాంతో ఆ నోట్లు అంటే జనం ఎగబడ్డారు. తమకు కొన్ని నోట్లు వచ్చినా.. లక్ష్మీదేవి దొరికినట్టే అనుకున్నారు. కానీ అదీ నకిలీదని వారికి తెలియలేదు. అందుకోసమే కాస్త దూరం అయినా.. కష్టపడి మరీ ఎరుకున్నారు. కానీ మార్కెట్లో రూ.2 వేలు నోటు ఉండటం లేదని.. వాటిని కొత్తగా ప్రింట్ చేయడం లేదనే విషయాన్ని గమనించలేకపోయారు. క్షణికావేశంలో పరుగెత్తి తీసుకొని మరీ.. ఊసురుమన్నారు.

English summary
rs.2000 fake currency notes on road. incident happen at hyderabad madhapur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X