sajjanar:ఆర్టీసీని కాపాడుకుందాం, కార్యాచరణ రూపొందిస్తున్నాం.. ఇలా
డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్.. ఆర్టీసీ ఎండీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పుల్లో ఉన్న ఆర్టీసీ కాపాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉందని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి.. సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సజ్జనార్ సూచించారు. ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు చర్యలు చేపడుతామని.. ఆర్టీసీ అభివృద్ధి విషయమై అధ్యయనం చేసి, కార్యాచారణ ప్రణాళిక రూపొందిస్తామని పేర్కొన్నారు.

ఆర్టీసీకి వెన్ను దన్ను
ఆర్టీసీకి చాలా కాలం నుంచి ప్రభుత్వం సహకారం అందిస్తోందని సజ్జనార్ వివరించారు. ప్రభుత్వానికి భారం కాకుండా సొంతంగా నిలబడేందుకు చర్యలు తీసుకుంటామని సజ్జనార్ స్పష్టం చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో జిల్లాల్లో వివిధ హోదాల్లో పని చేసిన సందర్భాల్లో.. ఆర్టీసీ అధికారులతో సమావేశం అయ్యానని గుర్తుచేశారు. ఆర్టీసీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించిన అనుభవం ఉందని పేర్కొన్నారు. ఏడాదిన్నర నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. ఆర్థిక వ్యవస్థ కూడా బాగా దెబ్బతిందని.. రవాణా పరిశ్రమ పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. టూరిజం వ్యవస్థ కూడా ఎఫెక్ట్ అయిందని సజ్జనార్ పేర్కొన్నారు.

డీజిల్ వాత..
గత రెండేళ్లలో డీజిల్ రేట్లు రూ. 21 పెరిగిందని ఆయన వివరించారు. స్పేర్ పార్ట్స్ రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి అని సజ్జనార్ తెలిపారు. దీంతో సమస్యలు రావడం జరిగిందన్నారు. ఆర్టీసీ సిబ్బంది కరోనా సమయంలో కూడా బాగా పని చేశారని వివరించారు. ఆక్సిజన్ సిలిండర్లతోపాటు మెడిసిన్స్‌ను ట్రాన్స్‌పోర్టు చేయడంలో చాలా కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. చాలా మంది ప్రాణాలను కాపాడగలిగాం అని.. ఆదాయం పెంచేందుకు కార్గో పార్శిల్ సర్వీసును ప్రారంభించామని ఉదహరించారు. దాంతో కొంత ఆదాయం పెరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. సంస్థకు మరింత ఆదాయం పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
Recommended Video

ఆపన్నహస్తం..
క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఆర్టీసీని ఆదుకున్నారని సజ్జనార్ తెలియజేశారు. లాక్‌డౌన్ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించామని చెప్పారు. ప్రభుత్వంపై భారం కాకుండా సొంతంగా నిలబడేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ప్రయాణికులకు మంచి సర్వీసును అందించేందుకు కృషి చేయాలని.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తానని సజ్జనార్ చెప్పారు. మూడేళ్ల నుంచి ఇంచార్జీ ఎండీగా పని చేసిన సునీల్ శర్మకు సజ్జనార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

బదిలీ- నెక్ట్స్ డీజీపీ
హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలో.. ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. దళిత అధికారులకు మంచి పోస్టింగ్స్ ఇచ్చారు. ఆ క్రమంలోనే సజ్జనార్‌పై బదిలీ వేటు పడిందని సమాచారం. కానీ సీపీ నుంచి ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బదిలీ అయ్యారు. అయితే ఆర్టీసీ ఎండీ పదవీ చేపట్టిన తర్వాత.. నెక్ట్స్ డీజీపీ అనే వాదన ఉంది. ఇదివరకు చాలా మంది ఐపీఎస్ అధికారులను డీజీపీగా పదోన్నతి పొందారు. ఆ క్రమంలోనే సజ్జనార్‌కు బదిలీ తప్పలేదని.. త్వరలోనే డీజీపీ అవుతారని సమాచారం. రాష్ట్ర పోలీస్ బాస్ చేసేందుకు మధ్యలో కాస్త బ్రేక్ ఇచ్చారని విశ్వసనీయ సమాచారం.












Click it and Unblock the Notifications