హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

5వ తేదీ నుంచి స్కూల్స్, కాలేజీలు ఓపెన్.. కేసీఆర్ చేతికి ఆరోగ్యశాఖ రిపోర్ట్

|
Google Oneindia TeluguNews

కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. అయినా సీరియస్ నెస్ పెద్దగా లేదు. తెలంగాణలో కేసుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. ఏపీలో మరీ ఎక్కువగా ఉంది. జనవరిలోనే కేసుల ప్రభావం ఉంటుందని.. ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని నిపుణులు తెలియజేసిన సంగతి తెలిసిందే. దీంతో సంక్రాంతికి ఎప్పటి కన్నా 3 రోజులు ఎక్కువే సెలవులు ఇచ్చారు. కరోనా కేసుల నేపథ్యంలో సెలవులను పొడగించారు. ఆన్ లైన్ క్లాసుల వల్ల ఉపయోగం లేదని కొందరు పేరంట్స్ కూడా అనుకుంటున్నారు. ఈ లోపు ప్రభుత్వం కూడా వైద్యారోగ్య శాఖ నుంచి నివేదిక తెప్పించుకుంది.

కేసుల ప్రభావం జనవరి 30వ తేదీ వరకు ఉండనుంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పరిశీలించనుంది. తర్వాత 5వ తేదీ నుంచి స్కూల్స్, కాలేజీలు ప్రారంభిస్తారు. జిల్లాల్లో కరోనా పరిస్థితులను బట్టి ఆఫ్ లైన్ లేదంటే.. ఆన్ లైన్ క్లాసులు జరిపే ఛాన్స్ ఉంది. వైద్యారోగ్య శాఖ తన నివేదికను సీఎం కేసీఆర్‌కు అందజేసింది. దానిని పరిశీలించి.. సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు.

schools and colleges are open february 5th in telangana state

దేశంలో ఒమిక్రాన్ సాముహిక వ్యాప్తి దశకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటన చేసింది. ఇప్పటికే చాలా మంది దీని బారిన పడి ఉంటారు. లక్షణాలు కూడా ఒకేలా ఉండటంతో ఏదీ కరోనో.. ఏదీ ఒమిక్రాన్ నిర్ధారించడం కష్టం అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అయితే కరోనా, ఒమిక్రాన్ ఓకేలా చూస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు జనవరి వరకు కరోనా పూర్తిగా తగ్గుముఖం పడుతుందనే వార్తలు ఊరట కలిగిస్తున్నాయి. యూరప్‌లో కూడా ఈ ఏడాది చివరి వరకు కరోనా వైరస్ అంతం అవుతుందని ప్రకటన చేసింది.

ఇటు వ్యాక్సిన్ తీసుకున్న వారి జోలికి ఒమిక్రాన్ రాబోదని.. అందుకే నిపుణులు కచ్చితంగా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. వైరస్ తగ్గుముఖం పడుతున్న.. జాగ్రత్తతో ఉండాలని కోరింది. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ మాత్రం వేగంగా వ్యాప్తి చెందింది. అందరినీ ఒకసరి పలకరించింది మరీ వెళ్తుంది. అలా రాజకీయ నేతలు కూడా వైరస బారిన పడతున్నారు. వారంత వృద్దులే కావడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది.

English summary
schools and colleges are open february 5th in telangana state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X