31 నుంచి స్కూల్స్ ఓపెన్ చేస్తారా..? సారాలమ్మ జాతరపై ప్రశ్న: హైకోర్టు
తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ అరికట్టేందుకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై మరోసారి ధర్మాసనం విచారణ చేపట్టింది. కరోనా ఉదృతంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆంక్షలపై పూర్తి వివరాలతో ప్రత్యక్ష విచారణకు హాజరుకావాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌ను హైకోర్టు గతవారం ఆదేశించిన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన విచారణకు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆన్ లైన్ ద్వారా హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వ న్యాయవాది ఆధ్వర్యంలో హైకోర్టుకు వివరాలను వివరించారు.

స్కూల్స్ స్టార్ట్..
పలు విషయాలను ధర్మాసనం అడిగి తెలుసుకుంది. జనవరి 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా అని హైకోర్టు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వ న్యాయవాది బదులిస్తూ పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. వైద్య కిట్లలో పిల్లల చికిత్స ఔషధాలు లేవనే పిటిషన్ తరుపు న్యాయవాదుల ప్రశ్నకు.. డీహెచ్ శ్రీనివాస్ బదులిచ్చారు. పిల్లలకు మందులు కిట్ల రూపంలో నేరుగా ఇవ్వకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉందన్నారు.. ఆంక్షలు విధించాల్సిన అవసరం రాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

77 లక్షల ఇళ్ల జ్వర సర్వే
రాష్ట్రవ్యాప్తంగా 77 లక్షల ఇళ్లల్లో జ్వర సర్వే చేసి లక్షణాలు ఉన్న బాధితులకు 3.45 లక్షల కిట్లు పంపిణీ చేశామని డీహెచ్ శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం కరోనా సమయంలో సమ్మక్క జాతర ఏర్పాట్లు, వారాంతవు సంతల్లో కోవిడ్ జాగ్రత్తలు, పాఠశాలల ప్రారంభంపై మూడు రోజుల్లోగా పూర్తి నివేదికతో రావాలని హెల్త్ డైరెక్టర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.

నిర్ణయం తీసుకోలే..
ఇటు రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు నిలకడగా ఉండడం సానుకూల అంశంగా మారింది. విద్యా సంస్థల ప్రారంభంపై వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని త్వరలో తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 8వ తేదీ నుంచి విద్యా సంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సెలవులు.. కానీ 3 రోజులు అదనంగా ఉన్నారు. 16వ తేదీ వరకు పండుగ సెలవులు ఇచ్చారు. ఆ తర్వాత కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని 30వ తేదీ వరకు సెలవులను పొడిగించారు. ప్రస్తుతం 8,9,10వ తరగతుల విద్యార్థులతోపాటు, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు.
Recommended Video

పొడగింపు.. స్కూల్స్ స్టార్ట్..?
30వ తేదీతో ముగియనున్న సెలవులను పొడిగిస్తారా? లేక విద్యా సంస్థలను ప్రారంభిస్తారా? అన్న అంశంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు పాఠశాలలను తెరవాలని ప్రైవేట్ యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. రెండేళ్ల నుంచి స్కూళ్లు సరిగ్గా నడవకపోవడంతో విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం పడిందని అంటున్నాయి. వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా జరుగుతుండడం, ప్రస్తుత కరోనా వేరియంట్ అంత ప్రమాదకారి కాకపోవడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని విద్యా సంస్థలను తెరవాలని కోరుతున్నాయి.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications