హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణా ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్‌కు దగ్గరగానే నేటి బడ్జెట్ .. ఆర్ధిక మందగమనం ఎఫెక్ట్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ కేబినెట్ విస్తరణ పూర్తయింది. ఎవరూ ఊహించని విధంగా ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా కేసీఆర్ కేసీఆర్ క్యాబినెట్ విస్తరణ జరిగింది. ఇద్దరు మహిళలకు సైతం స్థానం దక్కింది. ఇక ఇవాళ్టి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేసీఆర్ ప్రవేశపెట్టనుండగా.. శాసనమండలిలో ఆర్ధికమంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

వినాయక మండపంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే విగ్రహం .. మరో వివాదంలో గులాబీ పార్టీవినాయక మండపంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే విగ్రహం .. మరో వివాదంలో గులాబీ పార్టీ

మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు బడ్జెట్‌

మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు బడ్జెట్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు పూర్తిస్థాయి బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆదివారం రాత్రి ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు పూర్తిస్థాయి బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ భేటీలో 2019-20 పూర్తిస్థాయి బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభలో సీఎం కేసీఆర్‌, మండలిలో ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో రూ.1,82,017 కోట్లతో ప్రభుత్వం ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఇక తాజాగా ప్రవేశపెడుతున్నది పూర్తిస్థాయి బడ్జెట్‌ అయినా మిగిలిన ఆరు మాసాలకు సంబంధించినదిగానే భావించాలి.

 దేశ ఆర్ధిక మందగమనం దృష్ట్యా ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్‌కు దగ్గరగానే బడ్జెట్

దేశ ఆర్ధిక మందగమనం దృష్ట్యా ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్‌కు దగ్గరగానే బడ్జెట్

ఇక దేశ ఆర్ధిక మందగమనం దృష్ట్యా దీనిని వాస్తవ పరిస్థితులకు అనుగుణంగాబడ్జెట్ రూపొందించినట్టు సమాచారం. రాష్ట్రంలో పెరిగిన వ్యయాలు, బకాయిల నేపథ్యంలో బడ్జెట్‌ ను చాలా జాగ్రత్తగా రూపొందించారు . ఇక దీనిలో పెరుగుదల పెద్దగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్‌కు కాస్తా అటూ ఇటూగా ఉంటుందని సమాచారం. జీఎస్డీపీ మెరుగ్గానే ఉందని, పన్నుల వృద్ధి రేటు 17 శాతం కంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నా రాబడులు, వ్యయాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండకుండా జాగ్రత్త వహించినట్టు తెలుస్తుంది .

 కొత్త రోల్ లో కనిపించనున్న ట్రబుల్ షూటర్ హరీష్ రావు

కొత్త రోల్ లో కనిపించనున్న ట్రబుల్ షూటర్ హరీష్ రావు

ఇక ఆదివారం రాజ్ భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారాలు ఘనంగా జరిగాయి. నూతన గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ట్రబుల్ షూటర్ హరీష్ రావు, కేటీఆర్ మరోసారి మంత్రులుగా మరోసారి కొనసాగనున్నారు . ఇది ఇలా ఉంటే ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఇకపై కొత్త రోల్‌లో కనిపించబోతున్నారు. తొలిసారి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహించబోతున్న హరీష్ రావు.. మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

హరీష్ కు ఆర్ధిక శాఖ అప్పగించిన కేసీఆర్ .. హరీష్ కు కత్తి మీద సామే

హరీష్ కు ఆర్ధిక శాఖ అప్పగించిన కేసీఆర్ .. హరీష్ కు కత్తి మీద సామే

2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఈటల రాజేందర్ ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు . ఇక గత డిసెంబర్‌లో రెండోసారి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ధిక శాఖ సీఎం కేసీఆర్ తన దగ్గరే పెట్టుకున్నారు. ప్రభుత్వం తరపున ఆయనే స్వయంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేసీఆర్... హరీష్ రావుకు ఆర్ధిక శాఖ బాధ్యతలు అప్పగించటం హాట్ టాపిక్ గా మారింది .ఇక హరీష్ కు ఆర్ధిక శాఖ కత్తి మీద సామే అని నిపుణుల అభిప్రాయం. దీంతో తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న రెండో ఆర్థికమంత్రిగా హరీష్ రావు రికార్డ్‌ను సొంతం చేసుకోనున్నారు.

English summary
Telangana Cabinet expansion completed. The KCR cabinet was expanded without any contradictions as no one would have expected. Both women were also placed. From now on, the Assembly Budget Sessions will begin. Assembly meetings begin at 11:30 am. KCR will introduce a full-fledged budget in the Assembly and harish rao will introduce budget in legeslative council
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X