హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Sri reddy:సంసారంలో సరిగమలు సహజమే, సమంతా వదిన, చైతు అన్న కలిసే ఉండండి...

|
Google Oneindia TeluguNews

శ్రీ రెడ్డి.. పరిచయం అక్కర్లేని తార. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్స్ చేసి సంచలనం రేపారు. తర్వాత ఒక్కొ స్టార్ గురించి చెబుతూ సెన్సేషన్ సృష్టించారు. ఈ మధ్య నాగచైతన్య- సమంత కపుల్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. అయితే వారి గురించి సాప్ట్‌గా మాట్లాడటం చర్చకు దారితీసింది. సామ్-చై విడిపోతున్నారని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. దానికి తగ్గట్టు ఇద్దరు- వేర్వేరుగానే కనిపిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీ రెడ్డి కల్పించుకున్నారు. ఇవాళే కాదు.. ఇదివరకు కూడా ఓసారి పాజిటివ్‌గా మాట్లాడారు.

సంసారంలో సరిగమలు

సంసారంలో సరిగమలు

సంసారంలో సరిగమలు సహజం అంటూ శ్రీ రెడ్డి ట్వీట్ చేశారు. చిన్న చిన్న గొడవలు వస్తాయని, వాటన్నింటిని పరిష్కరించుకుని, కొన్ని విషయాల్లో రాజీ పడుతూ ఉండాలని సజెస్ట్ చేసింది. నాగ చైతన్య అన్నయ్య , సమంత వదిన ఇద్దరు కూడా సంసారాన్ని చక్క బెట్టుకునేందుకు ఒకరు కాస్త తగ్గాలని విజ్ఞప్తి చేసింది. ఇద్దరు చాలా మందికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. బ్యూటీఫుల్ కపుల్‌గా పేరు దక్కించుకున్నారని గుర్తుచేశారు. విడిపోతే చాలా మంది బాధ పడుతారని పేర్కొన్నారు. సమంత వదిన సంసారాన్ని చక్క బెట్టుకొ అని కోరింది శ్రీ రెడ్డి. కావాలంటే మోడలింగ్.. సినిమాలు ఏమైనా ఒక హద్దు వరకు చేసుకోవాలని సూచించింది.

మోడలింగ్, సినిమాలేనా..?

శ్రీ రెడ్డి రిక్వెస్ట్ ఓకే.. కానీ మోడలింగ్, సినిమాలు ఒక హద్దు వరకు చేయాలని కోరడంతో వారి మధ్య ఇదే విషయంపై గొడవ జరిగిందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే విడిపోతారు.. విడాకులు అనే ప్రచారం తప్పితే.. అంతకుమించి మీడియాకు కూడా ఏమీ తెలియదు. కానీ శ్రీ రెడ్డి కొత్త విషయాన్ని చెప్పారు. దీంతో ఆ దిశగా ఏమైనా తేడా వచ్చిందా అనే డౌట్ వస్తోంది. దీనిపై సామ్-చై ఎలాగూ స్పందించారు. ఇద్దరు దూరం దూరంగా ఉన్నా.. కలిసే ఉన్నట్టు బిల్డప్ క్రియేట్ చేస్తున్నారు. మరీ వారి మధ్య జరిగిన గొడవ బయటకు తెలిసే అవకాశం లేదు. సినిమాలు- మోడలింగ్‌తో మనస్పర్థలు వచ్చాయా అనే అంశం మాత్రం శ్రీ రెడ్డి ట్వీట్‌తో ప్రపంచానికి తెలిసింది.

పెళ్లికి ముందు అలా..

వాస్తవానికి చై.. సినిమా, మోడలింగ్‌పై ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. పెళ్లికి ముందు కూడా సినిమాల్లో నటించాలనే అభిప్రాయ పడ్డారు. తమకు బ్యాక్ గ్రౌండ్ ఉందని.. వారు ఈ స్టేజీకి రావడానికి చాలా కష్టపడ్డారని ఆ సమయంలో చెప్పారు. మరీ పెళ్లయిన.. ఇన్నాళ్లకు చై.. మనసు మారిందా.. సినిమాలు వద్దు అని అంటున్నారా అనే అంశం చర్చకు వచ్చింది. అలా అయితే తొలినాళ్లలోనే వద్దనాలి కదా.. మరీ ఇప్పుడు ఇలా అనడం ఏంటో అని ఫ్యాన్స్ బుర్రలు పట్టుకుంటున్నారు. కానీ శ్రీ రెడ్డి వదిలిన బాణం మాత్రం పలు ప్రశ్నలను లెవనేత్తుతోంది.

Recommended Video

IPL 2021 : Who Is Venkatesh Rajasekaran Iyer, KKR's Latest Debutant ? || Oneindia Telugu
సాయి పల్లవితో చనువుగా..?

సాయి పల్లవితో చనువుగా..?

లేదంటే చై.. ఎవరితోనైనా క్లోజ్‌గా ఉంటున్నారా అనే ప్రశ్న వస్తోంది. ఇటీవల వచ్చిన లవ్ స్టోరీ మూవీలో.. హీరోయిన్‌గా సాయి పల్లవి చేసింది. ఆమెతో చనువుగా ఉంటున్నాడా అనే కొశ్చన్ వస్తోంది. కానీ ఇవీ అనుమానాలు/ అపోహలే అవుతాయి. ఎందుకంటే సినిమాల్లో నటించడం కామన్.. సమంత కూడా యాక్ట్ చేస్తోంది. అలాంటప్పడు తప్పు పట్టడానికి కారణం ఏమీ ఉంటుందనే ప్రశ్న వస్తోంది. నిప్పు లేనిదే పొగ రాదు అనే సామెత ఉందిగా.. సో సామ్- చై మధ్య మంటకు ఎవరూ కారణమై ఉంటారనే అంశంపై వారిద్దరూ పెదవి విప్పితే తప్ప ఫ్యాన్స్‌కు తెలిసే ఛాన్స్ లేదు.

English summary
sensational star Sri reddy asks samantha naga chaitanya be unite. they will be take divorce rumours speculate in the social media
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X