గుమ్మం దాటొద్దు: లాక్‌డౌన్.. కఠినం: అయినా తప్పదు: కేసీఆర్ సర్కార్ చెప్పినట్లు విందాం: కవిత

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత స్వాగతించారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా నివారించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయని, దీన్ని తప్పనిసరిగా పాటించాలని విజ్ఙప్తి చేశారు.

Recommended Video

    Kalvakuntla Kavitha Appeal To The People To Stay At Home In Lockdown Situation

    ఈ మేరకు బుధవారం ఉదయం ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. తెలంగాణ ప్రజలకు శార్వరీ నామ ఉగాది శుభాకాంక్షలను తెలియజేసిన ఆమె.. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన విషయాన్ని ప్రస్తావించారు. వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలపై స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్ కఠినంగా ఉందని, దీన్ని పాటించడం క్లిష్టమే అయినప్పటికీ అది తమను కాపాడటానికేననే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

    Stay at Home in lockdown, Kalvakuntla Kavitha appeal to the people

    లాక్‌డౌన్ బ్రేక్‌డౌన్ చేయకుండా ఇలాంటి సంక్లిష్ట సమయంలో ప్రభుత్వానికి అండగా ఉండాలని విజ్ఙప్తి చేశారు. ప్రభుత్వం చెప్పినట్టుగా నడుచుకుందామని చెప్పారు. కరోనా వైరస్ సోకిన వారి ప్రాణాలను కాపాడటానికి డాక్టర్లు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. అలాగే- పోలీసులు, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజల కోసం తమ జీవితాలను త్యాగం చేస్తున్నారని, ప్రాణాలను సైతం లెక్క చేయట్లేదని చెప్పారు.

    Stay at Home in lockdown, Kalvakuntla Kavitha appeal to the people
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+