హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Sun Halo At Hyderabad: మొన్న బెంగళూరు..ఇప్పుడు హైదరాబాద్: సూర్యుడి చుట్టూ వర్ణ వలయం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కొద్దిరోజుల కిందటే- ఉద్యాననగరి బెంగళూరులో మనోహరంగా కనిపించిన సన్ హాలో.. ఇప్పుడిక హైదరాబాద్‌లో ప్రత్యక్షమైంది. సూర్యుడి చుట్టూ సప్తవర్ణాల వలయం ఆవరించింది. కొన్ని గంటలపాటు కనువిందు చేసింది. ఏపీలోని కొన్ని నగరాల్లోనూ ఈ అపురూప దృశ్యం కనిపించింది. ఇలా కొత్తగా కనిపించిన సూర్యుడిని ఫొటోలు, వీడియోలు తీయడానికి జనం ఎగబడ్డారు. తమ మొబైల్ ఫోన్లలో క్లిక్‌మనిపించారు. ఆకాశం మేఘావృతం కావడం వల్ల మరి కొన్ని ప్రాంతాల ప్రజలు ఈ అద్భుతాన్ని చూడలేకపోయారు.

Recommended Video

Sun Halo : Hyderabad లో సూర్యుడి చుట్టూ వర్ణ వలయం, Reason Behind Sun Halo || Oneindia Telugu

సూర్యుడి చుట్టూ ఇలా ఇంద్రధనస్సు లాంటి వలయం కనిపించడాన్ని సన్ హాలో (Sun Halo)గా పేర్కొంటారు. 22 డిగ్రీ హాలో‌గా కూడా పిలుస్తుంటారు. వాతావరణంలో ఏర్పడే మార్పుల వల్ల ఇది కనిపిస్తుంటుంది. వాతావరణం ఎగువభాగాన ఉండే సైర్రస్ క్లౌడ్స్ వల్లే ఆ హాలో ఏర్పడుతుంటుంది. వాతావరణానికి 22 వేల అడుగుల ఎత్తులో ఈ క్లౌడ్స్ ఆవిర్భవిస్తుంటాయి. వాటి గుండా కాంతి ప్రసరించినప్పుడు హెక్సాగొనల్ మంచు స్ఫటికాలతో దాన్ని అడ్డుకునే క్రమంలో అది విచ్ఛిన్నమౌతుంది.

Sun Halo: after Bengaluru, now its Hyderabad turn

సైర్రస్ క్లౌడ్స్‌‌లో చిన్నచిన్న మంచు స్ఫటికాలు లె్క్క పెట్టలేనన్ని ఉంటాయి. వాటి గుండా సూర్యరశ్మి భూమి మీదికి ప్రసరించిన సమయంలో అది పరావర్తనం చెందుతుంది. ఇలా సన్ హాలో ఏర్పడితే.. వచ్చే 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని స్కై వాచర్స్ చెబుతుంటారు. బెంగళూరులో కూడా ఈ సన్ హాలో ఏర్పడిన తరువాత వర్షం కురిసింది. దీన్ని సాధారణ కంటితో చూసే అవకాశం ఉన్నప్పటికీ.. సూర్యడి వెలుగును మన కంటి చూపు భరించలేదు. ఈ తరహా సన్ హాలో ఏపీలోని పలు ప్రాంతాల్లో కనిపించింది.

English summary
After Bengaluru witnessed the Sun's halo, Now its Hyderabad's turn. Its a rare celestial event caused by dispersion of light when it passes through ice crystals in the upper level cirrus clouds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X