రక్తమోడిన గచ్చిబౌలి: టిప్పర్ ఢీ కొట్టిన వేగానికి కారు నుజ్జునుజ్జు: అయిదుమంది దుర్మరణం
హైదరాబాద్: ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిన గచ్చిబౌలి రక్తమోడింది. తెల్లవారు జామున చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం అయిదుమందిని బలి తీసుకుంది. అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతులందరూ పాతికేళ్లలోపు యువకులే కావడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. వారి కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు ఒకే ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.
మృతులను సంతోష్, మనోహర్, భరద్వాజ్, రోషన్, పవన్‌గా పోలీసులు గుర్తించారు. వారంతా అయ్యప్ప సొసైటీలో నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ తెల్లవారు జామున వారంతా ఏపీ 39 ఈడీ 5229 స్విఫ్ట్ కారులో గచ్చిబౌలి వైపు బయలుదేరారు. విప్రో సర్కిల్ వద్ద రెడ్ సిగ్నల్ పడినప్పటికీ.. రోడ్డు ఖాళీగా ఉండటం వల్ల ఆగలేదు. కారును వేగంగా ముందుకు పోనిచ్చారు.

అదే సమయంలో అటుగా వచ్చిన టిప్పర్.. కారును వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తోన్న సంతోష్, మనోహర్, భరద్వాజ్, రోషన్.. సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. పవన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.

టిప్పర్ ఢీ కొట్టిన వేగానికి కారు నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికి తీయడానికి తీవ్రంగా శ్రమించారు. కట్టర్లను తెప్పించి, కారు నుంచి మృతదేహాలను బయటికి తీశారు. దీనికోసం గంటపాటు శ్రమించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన పవన్‌ను ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం. అతివేగం, నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Recommended Video
— oneindiatelugu (@oneindiatelugu) December 13, 2020
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications