హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Telangana Budget Session 2021 -కరోనాలో హరీశ్ సాహసం -రూ.2,30,825 కోట్ల బడ్జెట్ -దేనికి ఎంతంటే..

|
Google Oneindia TeluguNews

కరోనా విలయం కారణంగా దాదాపు ఏడాదిన్నరగా ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలైపోతున్నా.. భవిష్యత్తుపై మెండైన ఆశలతో.. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు నిండైన బడ్జెట్ ప్రవేశపెట్టారు. గడిచిన ఏడాదిలో కొవిడ్ వల్ల రూ.50 వేల కోట్ల నష్టం వాటిల్లినా, ఆ ప్రభావం పద్దుపై ఏమాత్రం కనిపించలేదు. కీలక రంగాలకు కేటాయింపుల్లో కాంప్రమైజ్ కాకుండా, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామంటూ మంత్రి హరీశ్ రావు పద్దు సాగిందిలా...

 జగన్‌కు కేంద్రం షాక్ -చంద్రబాబును అడ్డంపెట్టి రైల్వే బాంబు -ఏపీ సర్కార్ దివాళా! -విశాఖ ఐటీఐఆర్‌ వెనక్కి జగన్‌కు కేంద్రం షాక్ -చంద్రబాబును అడ్డంపెట్టి రైల్వే బాంబు -ఏపీ సర్కార్ దివాళా! -విశాఖ ఐటీఐఆర్‌ వెనక్కి

రూ.2,30,825 కోట్ల బడ్జెట్

రూ.2,30,825 కోట్ల బడ్జెట్


2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు గురువారం ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది మొత్తం బడ్జెట్ విలువ రూ.2,30,825 కోట్లు అని తెలిపారు. రాష్ట్ర రెవెన్యూ వ్యయాన్ని రూ.1,69,383.44 కోట్లుగా చూపించిన మంత్రి హరీశ్.. ఆర్థిక లోటు అంచనా రూ.45,509.60 కోట్లుగా, మూలధన వ్యయం రూ.29,046.77 కోట్లుగా, పెట్టుబడి వ్యయం రూ.29,046.77 కోట్లుగా, రెవెన్యూ మిగులు రూ.6,743.50 కోట్లుగా పేర్కొన్నారు.

తెలంగాణలో మరో కొత్త పార్టీ! -కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ప్రకటన -కారు, కమలానికి దీటుగా?తెలంగాణలో మరో కొత్త పార్టీ! -కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ప్రకటన -కారు, కమలానికి దీటుగా?

ప్రగతి పథంలో తెలంగాణ..

ప్రగతి పథంలో తెలంగాణ..

''గడిచిన ఏడేళ్లలో తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. అభివృద్ధిలో అనేక రాష్ట్రాలను అధిగమించింది. ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ ప్రభుత్వం నెరవేరుస్తున్నది. నిర్దేశిత లక్ష్యాలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తున్నాం. సమస్యలు, సవాళ్లు అధిగమిస్తూ ప్రగతిపధాన పయనిస్తున్నాం. బడ్జెట్ గురుతర బాధ్యతలను నాకు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు'' అని మంత్రి హరీశ్ రావు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇక..

కేటాయింపులు ఇలా..

కేటాయింపులు ఇలా..


పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ- రూ.29,271 కోట్లు
వ్యవసాయశాఖ - రూ.25వేల కోట్లు
నీటిపారుదలశాఖ- రూ.16,931 కోట్లు
రైతుబంధు- రూ.14,800 కోట్లు
రుణమాఫీ- రూ.5,225 కోట్లు
సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ -రూ. వెయ్యి కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.1500 కోట్లు
పశుసంవర్థకశాఖ- రూ.1,730 కోట్లు
సమగ్ర భూ సర్వే- రూ.400 కోట్లు

నూత‌న స‌చివాల‌యం నిర్మాణానికి రూ. 610 కోట్లు

నూత‌న స‌చివాల‌యం నిర్మాణానికి రూ. 610 కోట్లు


వైద్యారోగ్య శాఖ‌కు రూ. 6,295 కోట్లు
విద్యుత్ రంగానికి రూ. 11,046 కోట్లు
సాగునీటి రంగానికి రూ. 16,931 కోట్లు
హోంశాఖ‌కు రూ. 6,465 కోట్లు
ఆస‌రా పెన్ష‌న్ల కోసం రూ. 11,728 కోట్లు
క‌ల్యాణ‌ల‌క్ష్మి షాదీముబార‌క్ ప‌థ‌కాల‌కు రూ. 2,750 కోట్లు
పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌కు రూ. 2,363 కోట్లు
సాంస్కృతిక ప‌ర్యాట‌క రంగాల‌కు రూ. 726 కోట్లు
ఐటీ రంగానికి రూ. 360 కోట్లు

డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల కోసం రూ. 11 వేల కోట్లు

డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల కోసం రూ. 11 వేల కోట్లు


మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ. 1000 కోట్లు
ఆర్టీసీకి రూ. 3000 కోట్లు(ఇందులో బ‌డ్జెటేత‌ర నిధులు రూ. 1500 కోట్లు)
అట‌వీశాఖ‌కు రూ. 1,276 కోట్లు
దేవాల‌యాల అభివృద్ధి, అర్చ‌కులు, దేవాదాయ ఉద్యోగుల సంక్షేమ కోసం రూ. 720 కోట్లు
ప‌రిశ్ర‌మ‌ల రాయితీ కోసం రూ. 2,500 కోట్లు
ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు రూ. 3,077 కోట్లు
ఆర్ అండ్ బీ రోడ్ల‌కు రూ. 800 కోట్లు
మైనార్టీ గురుకులాల నిర్వ‌హ‌ణ‌కు రూ. 561 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి రూ. 1,606 కోట్లు
పంచాయ‌తీరాజ్ రోడ్ల‌కు రూ. 300 కోట్లు

English summary
Telangana Finance Minister Harish Rao on Thursday morning introduced the Telangana state budget for the 2021-22 financial year with Rs 2,30,825 crore in the Legislative Assembly. here are full details and updates os ts budget 2021-2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X