హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Omicron:క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు, హరీశ్ రావు చైర్మన్, సభ్యులు వీరే.. మంత్రివర్గం నిర్ణయం

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ భయాందోళన కలిగిస్తోంది. సౌతాఫ్రికా నుంచి హైదరాబాద్ వచ్చిన 11 మందికి కరోనా సోకడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం గురించే కీలక చర్చ జరిగింది. ఒమిక్రాన్‌ ను ఎదుర్కునేందుకు కేబినెట్‌ సబ్‌కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కమిటీ చైర్మన్‌గా ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ఉండనున్నట్లు సమాచారం. కమిటీలో సభ్యులుగా మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావులతో పాటు సబితా ఇంద్రారెడ్డి ఉంటారు.

సమర్థంగా ఎదుర్కొంటాం..

సమర్థంగా ఎదుర్కొంటాం..

కరోనా కొత్త వేరియంట్‌ 'ఒమిక్రాన్‌'ను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు, టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌ కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించి హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ సన్నద్ధత, అనుసరిస్తున్న కార్యాచరణ, రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ టీకాల పురోగతి, మందుల లభ్యత, ఆక్సీజన్ బెడ్స్ సామర్థ్యం, తదితర అంశాలపై కేబినెట్‌ సమీక్ష నిర్వహించింది. కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు వైద్యశాఖ పూర్తి సన్నద్ధతతో ఉంది. అన్ని రకాల మందులు, పరికరాలు, మానవ వనరులు, పూర్తిగా అందుబాటులో ఉన్నాయని అధికారులు కేబినెట్‌కు వివరించారు.

మందులు, టీకాలు

మందులు, టీకాలు


రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో పరిస్థితులను సమీక్షించి, అన్ని రకాల మందులు, టీకాలు, అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకొని ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రివర్గం ఆర్యోగశాఖను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించింది. మంత్రులందరూ వారి వారి జిల్లాల్లో సమీక్షించాలని, అవసరమైన వారందరికీ సత్వరమే టీకా ఇప్పించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

ఎన్నడూ చూడలే

ఎన్నడూ చూడలే

ఇటు మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ వివిధ మ్యూటెంట్లను పరివర్తనం చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదివరకు ఇలాంటి కాంబినేషన్ చూడలేమని వారు వివరించారు. ఇమ్యూనిటీ ఉన్నవారు.. వ్యాక్సిన్ తీసుకున్న వారు వైరస్ బరి నుంచి తప్పించుకోవచ్చు అని తెలిపారు. దీనికి సంబంధించి రెండు విధాలుగా స్టడీ చేశామన్నారు. ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్ కొత్త వేరియంట్‌ను ఎదుర్కొగలవా అని ప్రశ్నిస్తే.. కచ్చితంగా తెలియదు అని సైంటిస్ట్ తెలిపారు. కానీ పౌష్టికాహారం తీసుకొని.. జాగ్రత్తగా ఉండాలని సజెస్ట్ చేశారు.

Recommended Video

Omicron : Why Did WHO Name This Covid Variant As Omicron? || Oneindia Telugu
పరివర్తనం చెంది

పరివర్తనం చెంది

కొత్త వేరియంట్‌ను ఒమ్రికాన్ అని పిలుస్తున్నారు. 50 ఉత్పరివర్తనాలు, స్పైక్ ప్రొటీన్‌లో 30 కన్నా ఎక్కువ ఉత్పరివర్తనాలు కనిపించాయి. ఈ స్పైక్ ప్రొటీన్ల ద్వారానే వైరస్ మన శరీరంలోకి చొచ్చుకుపోతుంది. అందుకే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సీన్లు వీటిని లక్ష్యాలుగా చేసుకుని పనిచేస్తాయి. ఇంకొంచెం లోతుగా చూస్తే రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో 10 ఉత్పరివర్తనాలు కనిపించాయి. మన శరీరంలోని కణాలను ముందుగా తాకేది వైరస్‌లో ఉన్న ఈ రిసెప్టర్ బైండింగ్ డొమైనే. ప్రపంచాన్ని గడగడలాడించిన డెల్టా వేరియంట్‌లో రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో రెండే ఉత్పరివర్తనాలు కనిపించాయి. ఈ స్థాయిలో మ్యుటేషన్లు, వైరస్‌తో ఏ మాత్రం పోరాడలేని ఒక రోగి శరీరం నుంచి బయటపడి ఉండవచ్చు.

English summary
telangana government form cabinet sub committee for Omicron variant. harish rao is committee chairman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X