హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణా ప్రభుత్వ కరోనా సాయం కోసం .. ఎర్రటి ఎండలోనూ బ్యాంకుల వద్ద పడిగాపులు

|
Google Oneindia TeluguNews

తెలంగాణా ప్రభుత్వం ప్రకటించిన కరోనా సాయాన్ని తీసుకునేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టటానికి లాక్ డౌన్ విధించిన నేపధ్యంలో రేషన్ కార్డు ఉన్న నిరుపేదలైన లబ్దిదారుల ఖాతాల్లో 1500 రూపాయలు వేసి ఆర్ధిక సాయం అందించింది ప్రభుత్వం . ఇక బ్యాంకుల్లో జమ అయిన రూ.1500 కోసం బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు.

 ప్రభుత్వ సాయం కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతున్న జనాలు

ప్రభుత్వ సాయం కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతున్న జనాలు

దాదాపు 25 రోజులుగా ఇళ్లకే పరిమితం కావటంతో పనుల్లేక పైసల్లేక , తినటానికి తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే సమయంలో ప్రభుత్వం అందించిన ఆర్ధిక సాయం ఆకలి బాధలు తీరుస్తుందని భావించిన చాలా మంది బ్యాంకుల వద్ద క్యూ కట్టారు. ఇక కరోనా భయాల నేపథ్యంలో డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్లిన ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ వరుసల్లో నిలుచోవడంతో కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఏర్పడుతున్నాయి.

 నగదు విత్ డ్రా కోసం ఎర్రటి ఎండలో బారులు

నగదు విత్ డ్రా కోసం ఎర్రటి ఎండలో బారులు


రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తుంది. నగదు విత్‌ డ్రా కోసం ఎర్రటి ఎండలో బారులు తీరుతూ ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారు. నిన్నటికి నిన్న ఒక మహిళ క్యూ లైన్ లో నిలబడి కుప్ప కూలిపోయింది. ప్రాణాలు పోగొట్టుకుంది. ఇక బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున కనిపిస్తున్న క్యూ లైన్లు ప్రజల ఆర్ధిక స్థితికి అద్దం పడుతున్నాయి . కేవలం 1500రూపాయల కోసం పడిగాపులు పడుతున్న తీరు సామాన్యుల కష్టాలకు ప్రతిగా నిలుస్తున్నాయి.

Recommended Video

TikTok Users Beware, TikTok Addiction Leads To Lost Life
 బ్యాంకుల దగ్గర టెంట్లు వేసినా సరిపోని పరిస్థితి.. డబ్బు కోసం పేదల ఇబ్బంది

బ్యాంకుల దగ్గర టెంట్లు వేసినా సరిపోని పరిస్థితి.. డబ్బు కోసం పేదల ఇబ్బంది

ఇప్పటికే రేషన్ కార్డు దారుల చాలా మంది ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. అయితే, అంతకుముందు జన్‌ధన్‌ ఖాతాల్లో జమ అయిన డబ్బులు తీసుకోకుంటే పోతాయన్న వదంతులతో బ్యాంకులకు జనం పరుగులు పెట్టిన విషయం తెలిసిందే . ఇక అదే తరహాలో ఇప్పుడు కూడా బ్యాంకులకు పరుగులు పెడుతున్నారు . దీంతో బ్యాంకుల వద్ద జనం బారులు తీరుతున్నారు. బ్యాంకు దగ్గరికి ఉదయమే వచ్చి ఎండల్లో క్యూ కడుతున్నారు. కొన్ని బ్యాంకుల దగ్గర టెంట్లు వేసినా సరిపోని పరిస్థితి ఉంది. వందలాది మంది తరలివస్తుండడంతో టెంట్లు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో ప్రజలు అరిగోస పడుతున్నారు.

English summary
The poor people have been confined to homes for almost 25 days and have trouble for eating . At the same time, many of the banks who had felt that the government's financial aid was useful for suffering from starvation were queuing up. In the wake of corona fears, people who go to the banks for money have to queue up as they line the physical distance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X