సీనియర్ ఐపీఎస్ వీకే సింగ్ కు తెలంగాణా సర్కార్ షాక్ .. వీఆర్ఎస్ కు బ్రేక్ వెనుక ఇదే రీజన్ !!
సీనియర్ ఐపీఎస్ అధికారి, పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా పని చేసిన వీకే సింగ్ వాలంటరీ రిటైర్మెంట్ కు తెలంగాణ సర్కార్ బ్రేక్ వేసింది. గాంధీ జయంతి రోజున తనకు వీఆర్ఎస్ ఇచ్చి రిటైర్ చేయవలసిందిగా అభ్యర్థించిన ఆయన ఫైల్ ను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. వీకే సింగ్ పై రెండు కేసుల్లో శాఖాపరమైన దర్యాప్తు కొనసాగుతోందని, ప్రస్తుతం ఆయన విఆర్ఎస్ ను రద్దు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆయన అభ్యర్ధనను తిరస్కరిస్తున్నట్లుగా అక్టోబర్ 2న ఆయనకు నోటీసు పంపించింది.

తెలంగాణా ప్రభుత్వంపై తీవ్ర అసహనంలో వీకే సింగ్
గత కొంత కాలంగా వీ కే సింగ్ తెలంగాణ సర్కార్ పై తీవ్ర అసహనంతో ఉన్నారు. ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రభుత్వానికి నేరుగా లేఖలే రాశారు. మొదటి నుండీ సంచలనాలకు కేరాఫ్ అయిన వీకే సింగ్ అటు జైళ్ళ శాఖలో పని చేసిన సమయంలో పలు ఆరోపణలను ఎదుర్కొన్నారు. పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు .పోలీస్ అకాడమీ వల్ల పెద్దగా ఉపయోగం లేదని సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ అకాడమీ కోసం చేస్తున్న ఖర్చు వృధా అని ఆయన అభిప్రాయపడ్డారు.

పదోన్నతి విషయంలోనూ ప్రభుత్వానికి లేఖ
ఇక మరోమారు తాను పదోన్నతికి పనికిరానా? అంటూ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు . జైళ్ల శాఖ డీజీ గా ఉన్నప్పుడు ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందువల్లే ఆయన తీరుతో ప్రభుత్వం ఆయనను ప్రింటింగ్ విభాగానికి బదిలీ చేసినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర పోలీస్ శిక్షణ కేంద్రం డైరెక్టర్ గా ఆయనను నియమించింది . గతంలో మీడియా పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక మీడియా ఛానల్ పైన కేసు పెట్టారు.

వీకే సింగ్ కు షాక్ ఇచ్చిన తెలంగాణా సర్కార్
అదనపు డీజీగా ఉన్న తనకు నిబంధనల ప్రకారం డీజీగా ఎందుకు పదోన్నతి ఇవ్వడం లేదంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.తాను పదోన్నతి పనికిరాను అని ప్రభుత్వం భావిస్తే ఈ ఉద్యోగాన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వీకే సింగ్ లేఖ రాశారు. ఆ తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటానంటూ ప్రభుత్వానికి రిటైర్ చెయ్యాలని మరో లేఖ రాశారు . దీనిపై ప్రభుత్వం ఆయనకు షాక్ ఇస్తూ ఆయన వీఆర్ఎస్ ను రద్దు చేసింది .
Recommended Video

వీకే సింగ్ పై ఉన్న కేసుల దర్యాప్తు .. సీరియస్ యాక్షన్ తీసుకోనున్న సర్కార్ ?
పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలోనే జూన్ 26వ తేదీన ఆయన వాలంటరీ రిటైర్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్‌ఎస్ పెట్టుకున్న కొద్దిరోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వం ఆయన పై బదిలీ వేటు వేసింది. స్టేట్ పోలీస్ అకాడమీ నుంచి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలంటూ వీకే సింగ్ ను అప్పట్లో ప్రభుత్వం ఆదేశించింది. కానీ దీనికి ఒప్పుకోని వీకే సింగ్ రాజీనామాకు సిద్దపడ్డారు. వీకే సింగ్ పై తెలంగాణ ప్రభుత్వం త్వరలో చర్యలు తీసుకోనున్నట్లుగా తెలుస్తుంది. పోలీస్ వ్యవస్థ పై విమర్శలు గుప్పించడంతో పాటుగా తెలంగాణ సర్కార్ పై విరుచుకుపడిన వికె సింగ్ పై సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్లుగా సమాచారం. అక్రమ కలప స్మగ్లింగ్ పై విచారణ చేపట్టి వీకే సింగ్ పాత్ర ఏమిటో తేల్చాలని తెలంగాణ సర్కార్ భావిస్తున్నట్టుగా సమాచారం.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications