కేటీఆర్‌తో సోనూసూద్ భేటీ: ఆ కీలక హామీనీ నెరవేర్చిన సూపర్ హీరో

హైదరాబాద్: కరోనా వైరస్ పెను సంక్షోభాన్ని మిగిల్చిన ప్రస్తుత పరిస్థితుల్లో దేశం మొత్తం బాలీవుడ్ నటుడు సోనూ సూద్ వైపు చూపులు సారించింది. రాజకీయ పార్టీలు, ప్రభుత్వంతో ఏ మాత్రం సంబంధం లేకపోయినప్పటికీ.. స్వచ్ఛందంగా కరోనా బారిన పడిన వారిని ఆదుకుంటోన్నారాయన. ఈ సంక్లిష్ట సమయంలో పేదలు, అవసరం ఉన్నవారికి అండగా నిలుస్తోన్నారు. ఆపన్న హస్తాన్ని అందిస్తోన్నారు. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల నుంచి ఆహారం వరకూ అవసరమైన అన్ని వసతులను కల్పిస్తోన్నారు.

Recommended Video

    #Telangana : Sonu Sood Today Met KTR At Pragati Bhavan || Oneindia Telugu

    దీనికోసం ఇప్పటికే కోట్లాది రూపాయలను వ్యయం చేశారు. ఏడాదికాలంగా అడిగిన వారికి లేదనకుండా తనవంతు సహాయన్ని అందిస్తోన్నారు సోనూ. ఇదే క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఇచ్చిన ఓ కీలకమైన హామీని కూడా సోనూ సూద్ నెరవేర్చారు. ఈ సారి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తానంటూ ఇదివరకే ఆయన కేటీఆర్‌కు వాగ్దానం చేశారు. చెప్పినట్టుగానే ఈ మధ్యాహ్నం సోనూసూద్ హైదరాబాద్‌కు వచ్చారు. కేటీఆర్‌‌ను కలుసుకున్నారు.

     Telangana: Sonu Sood meets minister KTR at Hyderabad

    పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్, టాలీవుడ్ దర్శకులు వంశీ పైడిపల్లి, మెహర్ రమేష్‌లతో కలిసి ఆయన కేటీఆర్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలు వారిమధ్య చర్చకు వచ్చాయి. తెలంగాణలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి కేటీఆర్.. సోనూసూద్‌కు వివరించారు. ప్రత్యేకించి- కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వైద్య, ఆరోగ్య శాఖను బలోపేతం చేస్తోన్నామని చెప్పారు. వైద్య రంగాన్ని వికేంద్రీకరించబోతోన్నామని అన్నారు.

     Telangana: Sonu Sood meets minister KTR at Hyderabad

    హైదరాబాద్‌లోనే కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నందు వల్ల జిల్లాల్లో వైద్య సౌకర్యాలు అందట్లేదంటూ ఫిర్యాదులు వచ్చాయని, ఈ పరిస్థితి తలెత్తకుండా డీసెంట్రలైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టామని కేటీఆర్ చెప్పారు. ప్రజలు తాము ఉన్న చోటే మెరుగైన వైద్య సౌకర్యాన్ని కల్పించే ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలిపారు. రాజధానికి ఎవరూ రావాల్సిన అవసరం ఉండబోదని అన్నారు. కిందటి నెల 1వ తేదీన కేటీఆర్-సోనూసూద్ మధ్య ట్విట్టర్ వేదికగా ఆసక్తికర సంభాషణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

    ఈ సారి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కొంత సమయమిస్తే కలుస్తానని అప్పట్లో విజ్ఞప్తి చేశారు సోనూ సూద్. తప్పకుండా కలుద్దామని కేటీఆర్ చెప్పారు. దీనికి అనుగుణంగా వారిద్దరూ ఈ మధ్యాహ్నం సమావేశమయ్యారు. సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి హైదరాబాద్‌కు వచ్చారు సోనూ. కేటీఆర్ అపాయింట్‌మెంట్ తీసుకుని మరీ.. ఆయనను కలిశారు. సోనూసూద్, టాలీవుడ్ దర్శకులను కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. సుమారు అరగంటకు పైగా వారితో సమావేశమయ్యారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+