Hyderabad: గుంతలతో జాగ్రత్త.. బోయిన్‍పల్లి అదుపు తప్పిన బైక్.. ఢీకొట్టిన డీసీఎం..
బుధవారం ఉదయం బాచుపల్లిలో రోడ్డుపై గుంత కారణంగా ఓ చిన్నారి మరణించిన కొద్ది గంటల్లోనే మరో రోడ్డు ప్రమాదం జరిగింది. బోయిన్ పల్లిలో బైక్ పై వెళ్తున్న తండ్రీకూతుళ్లు రోడ్డుపై గుంత కారణంగా అదుపు తప్పి కింద పడిపోయారు అదే సమయంలో వెనక నుంచి వస్తున్న డీసీఎం వారిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన తండ్రీకూతుళ్లను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ముఖ్యంగా కుమార్తె వైష్ణవి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. వైష్ణవి ఎంఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. వైష్ణవిని కాలేజీ బస్సు ఎక్కించేందుకు తండ్రి బైక్ పై తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డీసీఎం ఢీకొట్టి వెళ్లిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా డీసీఎంను గుర్తించే పనిలో పడ్డారు. రోడ్డుపై గుంతల కారణంగా బుధవారం రెండు ప్రమాదాలు జరిగాయి.

బాచుపల్లిలో కూడా ఇదే విధంగా రోడ్డు ప్రమాదం జరిగి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బాచుపల్లికి చెందిన కిషోర్ కుమార్తె దీక్షిత రెండో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం కిషోర్ తన స్కూటీపై దీక్షితను పాఠశాలలో విడిచి పెట్టడానికి వెళ్లాడు. వారు స్కూటీ ముందు వెళ్తోంది. వెనకాల ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు వస్తుంది. వారి స్కూటీ రెడ్డి ల్యాబ్స్ వద్దకు రాగానే.. అక్కడ రోడ్డుపై ఉన్న గుంత కారణంగా స్కూటీ బోల్తా పడింది.
పట్టుతప్పిన దీక్షిత రోడ్డుపై పడిపోయింది. వెనకాలే వస్తున్న బస్ ఆమె నుంచి వెళ్లడంతో ఘటనాస్థిలిలోనే మృతి చెందింది. కళ్ల ముందే కుమార్తె చనిపోవడంతో తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. అతను దీక్షిత దీక్షిత అంటూ రోదించిన తీరు స్థానికంగా ఉన్నవారిని కూడా కట్టతడి పెట్టించింది. ఈ ప్రమాదం కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications