Hyderabad: ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్..
హైడ్రా హైదరాబాద్ లోని చెరువులను పరిరక్షించడానికి నడుబిగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాదాపూర్ కావూరిహిల్స్ లోని పార్కులో అక్రమ కట్టడాలని హైడ్రా సోమవారం కూల్చివేసింది. ఆదివారం కూడా హైడ్రా అమీన్ పూర్, కూకట్ పల్లిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అయితే కూకట్ పల్లిలో నల్ల చెరువు వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చి వేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. తమకు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారని వారు వాపోయారు.
కనీసం సామాన్లు బయట పెట్టుకోవడానికి సమయం కూడా ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు బాగానే ఉన్నారు... భూమి లీజ్ ఇచ్చినవాడు బాగానే ఉన్నాడు. కానీ తమ పరిస్థితి దారుణంగా మారిందని అన్నారు. హైడ్రా ఉన్నవారి పట్ల ఓ రకంగా.. పేదవారి పట్ల మరో రకంగా వ్యవహరిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. కూకుట్ పల్లిలో బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు డిమాండ్ చేశారు.

చాలా మంది లీజ్ కు తీసుకుని రేకుల షేడ్లు వేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారని ఇప్పుడు వారి ఉపాధి మీద దెబ్బపడిందని అన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును పరిశీలించారు. చెరువు బఫర్, ఎఫ్టీఎల్ లో ఉన్న నిర్మాణాలను ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారుల సమాచారం అడిగి తెలుసుకున్నారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ లో ఉన్న భవన యజమానులకు హైకోర్టులో ఊరట లభించింది. దుర్గం చెరువు చుట్టూ కూల్చివేత చర్యలపై హైకోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో భవన యజమానులు ఊరట లభించినట్లయింది.
వాపోయారు.
అలాగే 2014లో జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు ప్రాంత వాసుల అభ్యంతరాలను పరిశీలించాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. అక్టోబర్ 4న భవన యజమానులు పరిరక్షణ కమిటీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. యజమానుల పరిగణనలోకి తీసుకుని అక్టోబరు 4 నుంచి ఆరు వారాల్లోగా తుది నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీనికి చెప్పింది. నోటీసులు తీసుకున్న వారిలో సీఎం సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. దుర్గం చెరువు 100 ఎకరాల్లో ఉండగా.. 84 ఎకరాలకు తగ్గిపోయినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications