• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రోడ్ల మీద చెత్త వేస్తే భారీ జ‌రిమానా..! నిర్ల‌క్ష్యం త‌గ‌దంటున్న తెలంగాణ సీయం..!!

|

హైదరాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రం విశ్వ‌న‌గ‌రం దిశ‌గా అడుగులు వేస్తోంది. క్లీన్ ఆండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్ర‌భుత్వ యంత్రాంగం న‌డుంబిగించిన‌ట్టు తెలుస్తోంది. అందులో బాగంగా రోడ్ల‌పైన చెత్త‌ను నిర్మూలించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. చెత్తను ఎవ‌రైనా నిర్ధేషించి ప్ర‌దేశంలో త‌ప్ప మ‌రెక్క‌డైనా వేస్తే పెద్ద యెత్తున జ‌రిమానా విధించేందుకు స‌న్నాహాలు చేస్తోంది యంత్రాంగం. స్వ‌యంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావే ఈ విష‌యంపై ద్రుష్టి కేంద్రీక‌రించ‌డంతో అదికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

చెత్త రోడ్ల మీద వేస్త 1000 జ‌రిమానా..! నిర్ల‌క్ష్యానికి త‌ప్ప‌దు భారీ మూల్యం..!!

చెత్త రోడ్ల మీద వేస్త 1000 జ‌రిమానా..! నిర్ల‌క్ష్యానికి త‌ప్ప‌దు భారీ మూల్యం..!!

చెత్త, వ్యర్థ పదార్థాలను నిర్దేశిత ప్రదేశంలో కాకుండా.. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పడవేస్తే ఇకపై జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చెత్తను ఇలా పడవేసిన వారికి రూ.500 జరిమానా విధించనున్నారు. సింక్‌ నుంచి, మురుగు నీటిని రోడ్డుపైకి వదిలినా, మంచినీటిని కలుషితం చేసినా రూ.500 జరిమానా పడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే 1000, గ్రామ పంచాయతీ స్థలాలను ఆక్రమిస్తే 2000 జరిమానాకు గురవుతారు.

పంచాయతీరాజ్‌ చట్టం ఇకపై పక్కాగా అమలు..! శ్రుతి మించితే త‌ప్ప‌దు శిక్ష‌..!!

పంచాయతీరాజ్‌ చట్టం ఇకపై పక్కాగా అమలు..! శ్రుతి మించితే త‌ప్ప‌దు శిక్ష‌..!!

ఈ మేరకు పంచాయతీరాజ్‌ చట్టం-2018లో కఠిన నిబంధనలు విధించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు ముగిశాక కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని పక్కాగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుతం పంచాయతీలన్నీ మురికి కూపాల్లా ఉన్నాయని, వీటిని మార్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నియమితులైన 9500 మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు నిబంధనల్ని పక్కాగా అమలు చేయాలని అన్నారు. లేదంటే మూడేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ను రెన్యువల్‌ చేయబోమన్నారు.

గ్రామపంచాయతీ స్థలాలను ఆక్రమిస్తే 2000 జరిమానా..! స‌భ‌లో సీయం ప్ర‌క‌ట‌న‌..!!

గ్రామపంచాయతీ స్థలాలను ఆక్రమిస్తే 2000 జరిమానా..! స‌భ‌లో సీయం ప్ర‌క‌ట‌న‌..!!

అవసరమైతే పంచాయత్‌రాజ్‌ శాఖను తన వద్దే పెట్టుకుంటానని సీఎం చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా చట్టం అమలుపై దృష్టి సారించాలన్నారు. చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారెవరిపైనైనా చర్యలు తీసుకునేందుకు పంచాయతీరాజ్‌ చట్టంలో వెసులుబాటు ఉందని, పంచాయతీ సర్పంచ్‌, కార్యదర్శితోపాటు ప్రజలు కూడా చట్టానికి అనుగుణంగానే నడుచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

అదికారుల‌కు ల‌క్ష్యాలు..! అతిక్రమిస్తే ఉద్యోగం పోయిన‌ట్టే..!!

అదికారుల‌కు ల‌క్ష్యాలు..! అతిక్రమిస్తే ఉద్యోగం పోయిన‌ట్టే..!!

నిభంద‌న‌లు ప‌క్కాగా అమ‌లు చేయ‌క‌పోతే సర్పంచ్‌ పదవికే ఎసరు వస్తుందని హెచ్చరించారు. చట్టంలో నిర్దేశిత లక్ష్యాల గురించి కూడా ముఖ్యమంత్రి వివరించారు. ముఖ్యంగా హరితహారంలో మొక్కల పెంపకం, వాటిని కాపాడటం, పన్నుల వసూళ్లు వంటి లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. పంచాయతీరాజ్‌ చట్టంలోని నిబంధనల్ని విస్మరిస్తే భారీ జ‌రిమానాలు విధించే అవ‌క‌శాలు కూడా క‌నిపిస్తున్నాయి.

English summary
The city of Hyderabad runs towards the world city. The government mechanism has been established to make it a clean and green city. It has taken steps to eradicate the rubbish on roads. The mechanism is to make a large fine if any of the garbage is dumped in or out of the roads.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X