Hyderabad: విద్యార్థి వీసా ఇంటర్వ్యూ తేదీలను ప్రకటించిన యూఎస్ కాన్సులేట్..

హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ మే నెలాఖరులో జరిగే ఇంటర్వ్యూల కోసం స్టూడెంట్ వీసా అపాయింట్‌మెంట్ స్లాట్‌ల మొదటి విడతను విడుదల చేసింది. వచ్చే జూన్, జూలై, ఆగస్టులో కాన్సులేట్ అదనపు అపాయింట్‌మెంట్ బ్యాచ్‌లకు అపాయింట్ మెంట్ ఇవ్వనుంది. భారతదేశంలోని యుఎస్ ఎంబసీ, కాన్సులేట్‌లు అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు 140,000 కంటే ఎక్కువ విద్యార్థి వీసాలు జారీ చేసినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది.

ఇది ఆల్-టైమ్ రికార్డ్‌గా పేర్కొంది. యూఎస్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో చదువుకునేందుకు విద్యార్థి విసాలు జారీ చేస్తారు.విదేశీ విద్యార్థులు చదువుకోవడం వల్ల అమెరికా దేశ ఆర్థిక వ్యవస్థకు సంవత్సరానికి USD 38 బిలియన్ల ఆదాయం వస్తుంది. జూన్-ఆగస్టు 2023 ప్రధాన విద్యార్థి వీసా సీజన్‌లో అపాయింట్‌మెంట్ ఇచ్చి.. హైదరాబాద్‌తో సహా భారతదేశం అంతటా US కాన్సులర్ అధికారులు F, M, J కేటగిరీలలో 95,269 వీసాలను జారీ చేశారు.

The US Consulate has opened student visa appointment slots for interviews

ఇది 2022 కంటే 18 శాతం ఎక్కువ. ఓపెన్ డోర్స్ రిపోర్ట్ డేటా ప్రకారం, 2009/10 తర్వాత మొదటిసారిగా USలో అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థులలో భారత్ చైనాను అధిగమించింది. పెరుగుతున్న వీసా దరఖాస్తుదారుల సంఖ్యకు అనుగుణంగా హైదరాబాద్‌లోని US కాన్సులేట్ ఇటీవలే కొత్త అత్యాధునిక భవనానికి మార్చారు. ప్రస్తుతం యూఎస్ కాన్సలేట్ Sy. నెం. 115/1, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్‌గూడ, హైదరాబాద్, తెలంగాణ, 500032 లో ఉంది. ఇది దక్షిణాసియాలో అతిపెద్ద US కాన్సలేటుగా ఉంది.

ఈ కాన్సలేట్ ను 340 మిలియన్ డాలర్లతో 12.2 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇందులో 54 వీసా ప్రాసెసింగ్ విండోలు ఉన్నాయి. అంతకు ముందు యూఎస్ కాన్సలేట్ పైగా ప్యాలెస్ లో ఉండేది. మార్చి 15, 2023 లీజు ముగియడంతో దాన్ని ఖాళీ చేశారు. మార్చి 20, 2023న కొత్త భవనంలో కార్యకలాపాలను ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+